Maharashtra: మహరాష్ట్రలో దారుణం జరిగింది. భోజనం రుచిగా పెట్టడం లేదని తల్లినే హతమార్చాడు ఓ వ్యక్తి. మహరాష్ట్ర థానేలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్టానికుల సమాచారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం. థానేలోని ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామంలో 55 ఏళ్ల తల్లి, కుమారుడు నివసిస్తుంటారు. అయితే ఇంట్లో పలు సమస్యలపై తరచూ తల్లి, కొడుకులు ఇద్దరు గొడవ పడుతుండే వారు. ఈ క్రమంలో ఆదివారం వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన కుమారుడికి మృతురాలు భోజనం వడ్డించింది.
Also Read: South Africa: సౌత్ ఆఫ్రికా గనిలో ప్రమాదం.. ఎలివేటర్ కూలి 11 మంది మృతి
అయితే ఆ భోజనం రుచికరంగా లేదని కొడుకు తల్లితో వాదించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో కోల్పోయిన కొడుకు తల్లి మెడపై కొడవలితో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లి మృతి చెందడంతో నిందితుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం కొడుకుపై 302 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలోనే ఉన్నాడని, వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Also Read: Telangana Elections 2023: గంట ముందే ఆ నియోజకవర్గాల్లో మైకులు బంద్