Maharashtra Local Body Elections: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ(ఎస్పీ) పార్టీలు చతికిలపడ్డాయి. మొత్తం 286 మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు ఈ రోజు (ఆదవారం) ప్రారంభైంది. రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి మధ్య ప్రత్యక్ష పోరాటం జరిగింది.
Read Also: Karimnagar: అప్పుల బాధ భరించలేక దంపతుల ఆత్మహత్య..
మొత్తం 246 మున్సిపల్ కౌన్సిల్లలో బీజేపీ 85 స్థానాల్లో, శివసేన(షిండే) 48 స్థానాల్లో, ఎన్సీపీ (అజిత్ పవార్) 32 స్థానాల్లో ఆధిక్యతన కనబరుస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో కాంగ్రెస్ 26, శివసేన యూబీటీ 09, ఎన్సీపీ(శరద్ పవార్) 12, ఎంఎన్ఎస్ 00 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. మిగతా స్థానాల్లో 23 మంది లీడింగ్‌లో ఉన్నారు.
42 నగర పంచాయతీల్లో బీజేపీ 27 చోట్ల, శివసేన(షిండే) 05 చోట్ల, ఎన్సీపీ(అజిత్ పవార్) 03 చోట్ల లీడింగ్‌లో ఉన్నాయి. ఇక మహాయుతి కూటమిలో శివసేన యూబీటీ 02, ఎన్సీపీ (శరద్ పవార్) 00, కాంగ్రెస్ 03 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ ఫలితాలను చూస్తే ఎన్డీయే కూటమి(మహాయుతి)కి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.