Mumabi: నూడిల్స్ లో టొమాటోను కలిపి తిన్నందుకు మహిళ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Eats Noodles Tomatoes, Dies: పరధ్యానంలో ఉంటూ పనులు చేస్తుంటే.. ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి ఉదాహరణ ఈ సంఘటన. చేసే చిన్న తప్పులే ప్రాణాలను మీదికి తీసుకువస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా తీస్తాయి. ముంబైలో జరిగిన ఘటన అందర్ని షాక్ కు గురిచేస్తోంది. ముంబైకి చెందిన ఓ మహిళ న్యూడిల్స్ టమాటాను కలిపి తింది.. దీంతో ఆమె మరణించింది. సాధారణంగా టొమాటోను నూడిల్స్ కలిపి తింటే చనిపోతారా..? అనే ప్రశ్న అందరికి రావచ్చు.. అయితే ఆ మహిళ మాత్రం ఎలుకను చంపేందుకు టోమాటోలో విషం పెట్టింది. ఈ విషయాన్ని మరిచి అదే టొమాటోను న్చూడిల్స్ వేసి వండింది. ఇది తిని చనిపోయింది.
Read Also: COVID 19: దేశంలో 20 వేలకు పైగా కేసులు.. పెరిగిన మరణాలు
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ముంబైకి చెందిన 27 ఏళ్ల మహిళ.. నూడిల్స్ తయారు చేస్తుండగా, ఎలుకలు విషం పెట్టిన టొమాటోను పొరపాటున న్యూడిల్స్ వేసి వండింది. ఈ ఘటన ముంబైలోని మలాడ్ లోని పాస్కల్ వాడి ప్రాంతంలో చోటు చేసుకుంది. రేఖ నిషాద్ అనే మహిళ జూలై 21న ఇంట్లో ఎలుకను చంపేందుకు టొమాటోలో విషం కలిపింది. మరుసటి రోజు న్యూడిల్స్ తయారు చేసే క్రమంలో.. టీవీ చూస్తూ ఎలుకల విషం పెట్టిన సంగతి మరిచి అదే టొమాటోను న్యూడిల్స్ వేసింది. దీంతో నూడల్స్ తిన్న సదరు మహిళకు కొన్ని గంటల్లోనే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. ఆమె భర్త, బావ సమీప ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. ప్రమాదవశాత్తు విషం కలిసిన టొమాటోను న్యూడిల్స్ లో కలపడం వల్లే మరణించిందని..మాల్వాని పోలీస్ ఇన్‌స్పెక్టర్ మూసా దేవర్షి వెల్లడించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!