Site icon NTV Telugu

Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన సీఎం ఏక్‌నాథ్ షిండే

Eknath Shinde

Eknath Shinde

Eknath Shinde: ముంబయి ఆర్థిక స్థితి గురించి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసి వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేతో పాటు విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై వెంటనే గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించాలని కూడా కోరాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు.

గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన మాటలతో తాము ఏకభవించమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. కోశ్యారీ రాజ్యాంగాబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముంబైవాసులను తాము ఎప్పుడూ మరిచిపోమన్నారు. ముంబై అభివృద్ధి కోసం మరాఠీ ప్రజలు ఎంతో కృషి చేశారని ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు. ముంబై ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరమని వెల్లడించిన సీఎం.. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రజలు ముంబైని సొంత ఇంటిగా భావిస్తున్నప్పటికీ మరాఠీ ప్రజలు తమ గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకున్నారని పేర్కొన్నారు. అలాంటి మరాఠీ ప్రజలను అవమానించకూడదన్నారు.

Uddav Thackeray: మహారాష్ట్ర గవర్నర్ మరాఠీలను అవమానించారు.. రాజీనామాకు డిమాండ్!

శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్ ముంబైలోని అంధేరీలో ఓ చౌక్‌కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. ఆయన మాట్లాడుతూ.. ‘గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్ర నుంచి మరీ ముఖ్యంగా ముంబయి, ఠాణెను విడిచివెళ్లిపోతే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదు. ముంబయి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత కోల్పోతుంది’ అని వ్యాఖ్యానించారు. వీటిని మహారాష్ట్ర నేతలు ఖండించారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో గవర్నర్ వివరణ ఇచ్చారు. మరాఠీ ప్రజల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ఆయన్ను ఇంటికి పంపాలా లేక జైలుకు పంపాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ మండిపడ్డారు

Exit mobile version