physical assault on minor girl in madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 16 ఏళ్ల బాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో రేవా జిల్లాలో శనివారం 16 ఏళ్ల బాలికను ఆరుగురు వ్యక్తుల అపహరించారు. వీరిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు. వీరందరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తనకు కాబోయే భర్తతో కలిసి శనివారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లింది. ఈ సమయంలో దంపతులు ఆలయం సమీపంలో కూర్చొని ఉండగా.. నిందితులంతా కలిసి బాలికను అపహరించారు. సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి కాబోయే భర్తను నిందితులు కొట్టారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలి.. 7 రాష్ట్రాల తీర్మానాలు
ఈ ఘటనపై బాధితురాలికి కాబోయే భర్త పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికకు మహిళా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పోలీసులు 22 ఏళ్ల యువకుడితో పాటు ఇద్దరు 17 ఏళ్లు ఉన్న మైనర్లను, ముంబైకి చెందిన 26 ఏళ్ల వ్యక్తిని, ఇతర నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వీరందరిపై ఐపీసీలోని పలు అత్యాచార సెక్షన్ల కింద, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
నిందితులందరూ కూలీలుగా పనిచేస్తున్నారని.. వారి నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. రేవాలోని నిందితుల్లో ఒకరి ఇంటిని అధికారులు సోమవారం కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఈ అధికారులు ఇంటిని కూల్చేశారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని.. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు రేవా జిల్లా కలెక్టర్ మోనోజ్ పుస్ప్ తెలిపారు. మిగిలిన నిందితుల ఆస్తులను తనిఖీ చేస్తున్నారు అధికారులు. ఏదైనా అక్రమ నిర్మాణంగా తేలితే వాటిని కూడా కూల్చేయనున్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు.