Nithya Menen: దుల్కర్ సల్మాన్ నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dulquer Salman Suggestion To Nithya Menen On Marriage: కొన్ని రోజుల నుంచి పెళ్లి రూమర్లతో నిత్యా మీనన్ నిత్యం వార్తల్లోకెక్కుతోంది. తొలుత ఓ యూట్యూబర్ తెగ హంగామా చేశాడు. తాను నిత్యాని ప్రేమిస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటూ హల్‌చల్ చేశాడు. అయితే, అందులో వాస్తవం లేదని, రివర్స్‌లో అతడు వేధిస్తున్నాడంటూ ఆ యూట్యూబర్ నోరు మూయించేసింది. తాను ఇప్పుడిప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదని క్లారిటీ ఇచ్చింది. అయినా.. రూమర్స్ తగ్గలేదు. పెళ్లికి సిద్ధమైంది కాబట్టి, ఏ సినిమాలకు సంతకం చేయట్లేదని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే నిత్యా మీనన్ మరోసారి మీడియా ముందుకొచ్చి, ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.
‘‘నా కాలికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నాను. కానీ, మీడియా వాళ్లు మాత్రం ఏవేవో కథనాలు రాసేస్తున్నారు. పెళ్లి చేసుకుంటోంది కాబట్టి కథలు వినట్లేదు అని రూమర్స్ పుట్టించేశారు. ఆ వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు’’ అని నిత్యా మీనన్ చెప్పింది. ఇదే సమయంలో.. దుల్కర్ సల్మాన్ తనకు ఒక మంచి స్నేహితుడని, పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండమని సూచిస్తుంటాడని తెలిపింది. తాము కలిసినప్పుడల్లా పెళ్లి ప్రస్తావన వస్తూనే ఉంటుందని పేర్కొంది. అయితే.. తనకు మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని వెల్లడించింది. భవిష్యత్తుల్లో కూడా చేసుకుంటానో లేదోనంటూ కుండబద్దలు కొట్టింది. నిజానికి.. ఓ వయసుకి వచ్చాక కథానాయికలు పెళ్లి చేసుకొని సెటిలవుతారు. కానీ, నిత్యా మాత్రం అందుకు భిన్నంగా పెళ్లిపై ఆసక్తి లేదని బాంబ్ పేల్చడం వెనుక ఏదో మతలబు ఉందంటూ చెప్పుకుంటున్నారు.
Also Read
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
ఈ క్రమంలోనే తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఓ ఇబ్బంది గురించి కూడా నిత్యా చెప్పుకొచ్చింది. తనని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారని వార్తల్ని ఓసారి పుట్టించారని, అది తనని తీవ్రంగా కలచివేసిందని చెప్పింది. ఎవరో కావాలనే ఆ తప్పుడు ప్రచారానికి తెరలేపారని వాపోయింది. మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కిందకు లాగేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారని, తన విషయంలోనూ అదే జరిగిందని పేర్కొంది. అయితే.. అందరి గురించి ఆలోచిస్తూ పోతే, తన పనులు చేసుకోవడానికి సమయం దొరకదని, అందుకే అలాంటి రూమర్స్‌కి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వట్లేదని నిత్యా మీనన్ వెల్లడించింది.
తాజావార్తలు
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!