కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ దేశంలో 60 లక్షల మందికి పైగా టీకాలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా 24 గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించింది. అంటే గంటకు లక్ష మందికి వ్యాక్సిన్ అందించింది. 24 గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి టీకాలు అందించి రికార్డ్ సృష్టించింది. గతంలో కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 17.62 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించి అప్పట్లో రికార్డ్‌ను సృష్టించింది. కాగా, ఇప్పుడు ఆ రికార్డును మరోసారి బ్రేక్ చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.
Read: ఏపీ కరోనా అప్డేట్…