Madhya Pradesh: మధ్యప్రదేశ్లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువగా ఈ పార్టీ వారే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 186 (81 శాతం) మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం ఓ నివేదికలో తెలిపింది. 230 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సగటున రూ. 10.76 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని, ఇది 2013లో ఎన్నికైన ప్రతీ ఎమ్మెల్యే సగటు రూ. 5.25 కోట్ల కన్నా 105 శాతం ఎక్కువ అని, 2008లో ఎన్నికైన ఎమ్మెల్యే సగటు రూ. 1.44 కోట్ల కన్నా 647 శాతం ఎక్కువ అని తెలిపింది.
నివేదిక ప్రకారం 129 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 107(83శాతం) మంది కోటీశ్వరులే కాగా.. 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 76 (78 శాతం) మంది కోటీశ్వరులే. నలుగురు స్వతంత్య ఎమ్మెల్యేల్లో ముగ్గురు కోటీశ్వరులే అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
Read Also: AUS vs PAK: పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఆసీస్ ఓపెనర్లు.. సెంచరీలతో చెలరేగిన వార్నర్, మార్ష్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2008 ఎన్నికల్లో ఎన్నికైన కోటీశ్వరులైన ఎమ్మెల్యేల సంఖ్య 84గా ఉంటే 2013లో 161కి చేరింది. ఇది 92 శాతం ఎక్కువ. ఇక 2018లో 15.5 శాతం పెరిగి 186 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా తేలింది. 2013లో అధికార బీజేపీలో 118 మంది కోటీశ్వరులు ఉంటే.. 2018 ఎన్నికల్లో 9 శాతం తగ్గి 107కు చేరుకుంది. 2013లో 40గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 2018లో 142 శాతం పెరిగి 97కి చేరుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి చెందిన సంజయ్ పాఠక్ అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాఠక్కి 2013లో రూ. 141 కోట్ల ఆస్తులు ఉంటే, 2018లో 60 శాతం పెరిగి రూ. 226 కోట్లకు చేరింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ధనిక ఎమ్మెల్యేల జాబితాలో రూ.124 కోట్లతో ఆరోస్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్తులు మాత్రం రూ. 7 కోట్లుగా ఉన్నాయి. బీజేపీకి చెందిన గిరిజన ఎమ్మెల్యే రామ్ దంగోర్ కేవలం రూ. 50,000 ఆస్తులతో పేద ఎమ్మెల్యేగా ఉన్నారు. 129 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 30 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. 97 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 54 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!