Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahaana Krishna Wedding: మలయాళ నటి అహానా కృష్ణ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి ఒక్కటయ్యారు. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న వీరి స్నేహం, ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంగా మారింది. సెప్టెంబర్ 13న కేరళలోని కోవళంలోని తాజ్ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు రిషబ్ శెట్టి, ఆయన భార్య ప్రజ్ఞా శెట్టి, దుల్కర్ సల్మాన్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన విషయాన్ని అహానా స్వయంగా సెప్టెంబర్ 15న సోషల్ మీడియాలో వెల్లడించడంతో అభిమానులకు అసలు విషయం తెలిసింది. పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ ‘Met you at 20, Married you at 30’ అంటూ అహానా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. నిమిష్ను తన బెస్ట్ ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్, పార్ట్నర్, సోల్‌మేట్ అంటూ పేర్కొన్న ఆమె.. జీవితాంతం కలిసి ఒక ప్రపంచాన్ని నిర్మించుకోవాలని కోరుకుంటున్నట్లు ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
అహానా కృష్ణ మలయాళ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. 2014లో వచ్చిన ‘నేన్ స్టీవ్ లోపెజ్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత ‘లూకా’, ‘పతినెట్టం పడి’, ‘నిందుకలుడే నాటిల్ ఒరిడవేళ’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు, మాజీ రాజకీయ నాయకుడు కృష్ణ కుమార్ కుమార్తెగా కూడా అహానాకు సినీ కుటుంబ నేపథ్యం ఉంది. ఇక నిమిష్ రవి విషయానికి వస్తే.. దక్షిణాది సినిమాల్లో తన విజువల్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్. అహానా నటించిన ‘లూకా’ సినిమాతోనే ఆయన సినిమాటోగ్రాఫర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘కురుప్’, ‘రోర్షాక్’, ‘కింగ్ ఆఫ్ కోత’, ‘లక్కీ భాస్కర్’, ‘లోక’ వంటి సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందించారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
విశేషం ఏంటంటే.. అహానా, నిమిష్ పరిచయం కూడా సినిమా సెట్లోనే మొదలైంది. ఇప్పుడు అదే పరిచయం దాదాపు పదేళ్ల ప్రయాణం తర్వాత పెళ్లి బంధంగా మారింది. సెప్టెంబర్ 13న వివాహం జరగగా, అనంతరం తిరువనంతపురంలో రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఇలా తెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అహానా కృష్ణ, వెనుక కెమెరా ప్రపంచంలో పేరు తెచ్చుకున్న నిమిష్ రవి.. పదేళ్ల అనుబంధాన్ని జీవితాంతం కలిసి నడిచే బంధంగా మార్చుకున్నారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
- Tags
- Ahaana Krishna
- cinema
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!