పుదుచ్చేరిలో కరోనా కేసుల దృష్ట్యా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఆ రాష్ట్రంలో మే 24 వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నా కేసులు తగ్గకపోవడంతో పుదుచ్చేరిలో లాక్‌డౌన్ ను మరోసారి పొడిగిస్తున్నట్టు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ ప్రకటించారు. కరోనా రెండోదశ నియంత్రణ చర్యల్లో భాగంగా సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. మే 31 వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు గవర్నర్ మీడియాకు తెలిపారు. నిబంధనల ప్రకారం నిత్యవసర దుకాణాలు మద్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయని, ఆ తరువాత ప్రజలు అనవసరంగా రోడ్లమీదకు రాకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని తమిళిసై సూచించారు.