AAP: “లిక్కర్ స్కామ్” టూ “శీష్ మహల్”.. ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయానికి కారణాలు ఇవే..
- లిక్కర్ స్కామ్ టూ శీష్ మహల్..
- ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయానికి కారణాలు..
- కేజ్రీవాల్ సర్కార్‌పై పెరిగిన వ్యతిరేకత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిశీ మార్లేనా వంటి వారితో పాటు ఆ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారత, సత్యేందర్ జైన్ వంటి వారు వెనకంజలో ఉన్నారు. పదేళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్‌కి ఈ ఫలితాలు రుచించడం లేదు. ఇదే సమయంలో, దాదాపుగా 27 ఏళ్ల పాటు అధికారం కోసం శ్రమిస్తున్న బీజేపీ కల నెరవేరబోతోంది. అయితే, ఆప్ ఘోరపరాజయానికి అది చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆప్ ఓటమికి కారణాలు ఇవే:
Also Read
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ప్రభుత్వ వ్యతిరేకత:
2015, 2020లో గెలిచి వరసగా ఆప్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. విద్య , ఆరోగ్యం, విద్యుత్, నీటి సబ్సిడీలతో తన పదవీ కాలంలో ఓటర్లను సంతృప్తి పరిచింది. అయితే, రాజధానిలో గాలి నాణ్యత, యమునా కాలుష్యం ఢిల్లీ ఓటర్లలో ఆప్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. కేంద్రంలోని బీజేపీ తమ ప్రభుత్వానికి పనిచేసేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పలుమార్లు కేజ్రీవాల్ ఆరోపించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో పాటు కేంద్రంలో బీజేపీ ఉండటం, ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే ఎంపీలుగా ఉండటంతో ఈసారి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారు.
శీష్ మహల్:
ఆప్‌తో పాటు అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర వ్యతిరేకతకు ‘‘శీష్ మహల్’’ ఒక కారణమైంది. కేజ్రీవాల్ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి నివాసాన్ని కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ దీనిని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాగ్ నివేదిక కూడా ఈ ఖర్చుల్ని తప్పుపట్టింది. భవనం పునరుద్ధరణకు ప్రాథమిక అంచనా రూ. 7.91 కోట్లు అని కాగ్ దర్యాప్తులో తేలింది. అయితే, 2020లో ఇది రూ. 8.62 కోట్లకు, 2022 నాటికి రూ. 33.66 కోట్లకు పెరిగింది. సాధారణ వ్యక్తిగా ఉంటానని ఢిల్లీ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని కేజ్రీవాల్ మరిచారంటూ, అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ విమర్శించింది.
లిక్కర్ స్కామ్:
ఢిల్లీలో ఆప్ ప్రతిష్టకు ‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్’’ భంగం కలిగించింది. టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ, సీబీఐ ఈ కేసుని విచారించాయి. ఈ కేసులో భాగంగా కేజ్రీవాల్, సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి కీలక నేతలు జైలు పాలయ్యారు. ఢిల్లీని తాగుబోతుల నగరంగా మారుస్తుందని బీజేపీ, ఆప్‌పై విమర్శలు గుప్పించింది.
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!