Modi Retirement Debate: 75 ఏళ్లకే రిటైర్ కావాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోడీపై కాంగ్రెస్ సెటైర్లు!
- 75 ఏళ్లు వచ్చాక నాయకులు పక్కకు తప్పుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి..
- మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీకి వర్తిస్తాయా? అనే చర్చ..
- ప్రధాని మోడీ భగవత్ లపై తీవ్రంగా విరుచుకుపడిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Retirement Debate: నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లేపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. 75 ఏళ్లు వచ్చిన వాళ్లు కొత్త తరం వారికి మార్గం ఇవ్వాలి అని సూచించారు. అందుకు మోరోపంత్ జీవితాన్ని గుర్తు చేస్తూ.. ఒకసారి పింగ్లే చెప్పారు: 75వ సంవత్సరంలో మీకు శాలువా పడితే, అది పదవికి వీడ్కోలు చెప్పే సంకేతంగా భావించాలని పేర్కొన్నారు.. దేశ సేవలో పింగ్లే ఎంత నిబద్ధత చూపించారో, వయస్సు వచ్చినప్పుడు పక్కకు తగ్గిపోవడం ఒక సంస్కారం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలియజేశారు. ఇక, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ రాజకీయ మార్పులకు ఇవి సంకేతమా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: CM Chandrababu: వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. సీఎం సీరియస్.. కీలక ఆదేశాలు
Also Read
ఇక, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి చేశారని పేర్కొనింది. రాబోయే సెప్టెంబర్‌లో మోడీ, భగవత్ లకు 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారని తెలిపారు. ఇక, పేద ప్రధాని గొప్ప విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. 75 ఏళ్లు నిండిన వాళ్లు పదవీ నుంచి తప్పుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు జోడిస్తూ.. ఎక్స్ (ట్విట్టర్) లో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!