Delhi: ఢిల్లీలో లష్కర్ తోయిబా ఉగ్రవాది అరెస్ట్.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం
- ఢిల్లీలో లష్కర్ తోయిబా ఉగ్రవాది అరెస్ట్
- భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసి భద్రతా దళాలు
- ఉగ్రవాదిని విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశారు. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో జరిగినట్లుగా మరో భారీ కుట్రకు పాల్పడుతున్న ఉగ్రవాదుల పన్నాగాన్ని ఛేదించారు. ఢిల్లీ సరిహద్దులో లష్కర్ తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్‌ను భద్రతా దళాలు అరెస్ట్ చేసి అతి పెద్ద విజయాన్ని సాధించారు. లేదంటే మరోసారి భారతదేశంలో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది.
పాకిస్థానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్‌లో కొత్త లష్కర్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేసేందుకు పనిచేస్తున్న షబ్బీర్ అహ్మద్ లోన్‌ను ఢిల్లీ సరిహద్దులో భద్రతా సంస్థలు విజయవంతంగా అరెస్టు చేశాయి. ఒక సమాచారం ఆధారంగా.. ఢిల్లీ పోలీసులు, భద్రతా దళాలు రాజధాని సరిహద్దులో పక్కా ప్రణాళికతో ఉచ్చు పన్ని పట్టుకున్నారు. సరిహద్దు అవతల నుంచి అందిన ఆదేశాల మేరకు భారత్ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టే లక్ష్యంతో ఉగ్రవాది ఉన్నట్లుగా విచారణలో వెల్లడైంది.
Also Read
షబ్బీర్ అహ్మద్ లోన్ అరెస్ట్ తర్వాత విచారణ అధికారులు మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇంకెంత మంది సహచరులు దాగి ఉన్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తరహాలోనే మరో కుట్రకు తెరలేపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
భారత్ వ్యతిరేక పోస్టర్లు
ఇటీవల ఢిల్లీ, దక్షిణ భారతదేశంలో లష్కర్ తోయిబా ముఠాను ఛేదించారు. ఈ ముఠా ఢిల్లీ, కోల్‌కతాలోని వివిధ ప్రదేశాల్లో భారతదేశ వ్యతిరేక పోస్టర్లను అంటించింది. తాజాగా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, కేంద్ర ఏజెన్సీలు ఒక పెద్ద విజయాన్ని సాధించాయి.
ఇది కూడా చదవండి: IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
ఇది కూడా చదవండి: Rahul Banerjee: విషాదం.. యువ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!