Rahul Banerjee: విషాదం.. యువ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత
- యువ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత
- సముద్రంలో స్నానానికి వెళ్లి మృతి
- సీఎం మమతా బెనర్జీ సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాలీ యువ నటుడు రాహుల్ బెనర్జీ (43) అకాల మరణం చెందారు. సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది.
బెంగాల్ టీవీ సీరియల్ ‘‘భోలే బాబా పర్ కరేగా’’ (Bhole Baba Par Karega) షూటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. షూటింగ్ ముగిసిన తర్వాత రాహుల్ బెనర్జీ ఒంటరిగా సముద్రంలోకి వెళ్లారు. అయితే భారీ అలలు కారణంగా సముద్రంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటికే కనిపించకపోవడంతో యూనిట్ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే సహనటులు, సాంకేతిక నిపుణులు గమనించి నీటిలోంచి బయటకు తీశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటినా దీఘా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం 6:10 గంటలకు రాహుల్ బెనర్జీ చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
రాహుల్ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్, ఒక కుమారుడు ఉన్నారు. భర్త మృతిపై ప్రియాంక సర్కార్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘‘ఇది మా కుటుంబానికి ఎంతో దుర్భరమైన సమయం. ఈ కష్టకాలంలో మా గోప్యతను గౌరవించాలని మీడియా, స్నేహితులను కోరుతున్నాం. మాకు కొంత సమయం ఇవ్వండి.’’ అని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై సహనటుడు డిగంత బాగ్చి మాట్లాడుతూ… ‘‘షూటింగ్ ముగిసిన తర్వాత రాహుల్ ఒంటరిగా నీటిలోకి వెళ్లారు. ఏదో ఒక వస్తువులో చిక్కుకున్నట్లు అనిపించింది. మేమంతా కేకలు వేస్తూ బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం.’’ అని తెలిపారు.
ప్రముఖుల సంతాపం
రాహుల్ బెనర్జీ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రాహుల్ మరణం బెంగాలీ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం.’’ అని పేర్కొన్నారు. దర్శకుడు రాజ్ చక్రవర్తి, నటుడు-దర్శకుడు అంజన్ దత్ కూడా సంతాపం తెలిపారు.
రాహుల్ సినీ ప్రస్థానం
రాహుల్ 2008లో వచ్చిన ‘‘చిరోదిని తుమీ జే అమర్’’ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత ‘‘తుమీ అస్బే బోలే’ (2014), ‘జుల్ఫికార్’ (2016), ‘బ్యోమకేశ్ గోత్రో’ (2018), ‘బిదే బ్యోమకేశ్’ (2018), ‘ది అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ (2025) వంటి చిత్రాల్లో నటించారు . టెలివిజన్‌లో ‘హర్గౌరీ పీస్ హోటల్’, ‘మొహోన్నా’ వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. రాహుల్ ఆకస్మిక మరణం బెంగాలీ వినోద రంగానికి తీరని లోటుగా మిగిలింది.
తాజావార్తలు
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?