Lashkar-e-Taiba: దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడికి లష్కరే కుట్ర..

  • ఇస్లామాబాద్ పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ ప్లాన్..
  • ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడులకు లష్కరే కుట్ర..
Terror Attack

Terror Attack

Lashkar-e-Taiba: పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు సిద్ధమైంది. డిల్లీ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నింది. ఎర్రకోట సమీపంలో, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయంతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ మత ప్రదేశాల సమీపంలో పేలుళ్లకు ప్లాన్ చేస్తుందని భద్రతా సంస్థల నిఘా వెల్లడించింది. ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

Read Also: 2 Crore Tax Notice: రూ.6,000 సంపాదించే వ్యక్తికి రూ. 2 కోట్ల ట్యాక్స్ నోటీస్ జారీ.. ఈ తప్పు చేస్తే మీకు కూడా..!

ఇటీవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మసీదులో ఫిబ్రవరి 6న జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మరణించగా, 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి లష్కరే తోయిబా దేశవ్యాప్త పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. నవంబర్ 10, 2025న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు జరిగిన మూడు నెలల తర్వాత ఇస్లామాబాద్ పేలుడు జరిగింది. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడులో 12 మంది మరణించారు. హర్యానా ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తేలింది.

ఘటనకు ముందు భద్రతా అధికారులు ఏకంగా 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ బయటపడింది. ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో కీలక సభ్యులుగా ఉన్న డాక్టర్ ముజమ్మిల్ షకీల్ మరియు డాక్టర్ ఆదిల్ రాథర్‌లను అరెస్టు చేసిన తర్వాత, భయాందోళనకు గురైన ఉమర్ నబీ ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.