Laser weapon: భారత అమ్ములపొదిలో ‘‘లేజర్ వెపన్’’.. క్షణాల్లో డ్రోన్లు ఖతం.. వీడియో వైరల్..
- భారత అమ్ములపొదిలో ‘‘లేజర్ వెపన్’’..
- డ్రోన్లను కూల్చే కొత్త టెక్నాలజీ.. ఈ సామర్థ్యం ఉన్న కొద్ది దేశాల సరసన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laser weapon: భారత అమ్ములపొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. లేజర్ డైరెక్టెడ్ వెపన్(DEW) MK-II(A), సులభంగా చెప్పాలంటే లేజర్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తయారు చేసిన వ్యవస్థ ముఖ్యంగా ‘‘డ్రోన్’’లను టార్గెట్ చేస్తుంది. డ్రోన్లను ట్రాక్ చేసి, లేజర్ బీమ్‌ని ఉపయోగించి టార్గెట్‌ని నాశనం చేస్తుంది.
ఉక్రెయిన్, ఆర్మేనియా యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యం పెరగడంతో, వీటిని నాశనం చేసే ఆయుధాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఇది భారత సాయుధ దళాలకు గేమ్ చేంజర్‌గా మారబోతోంది. కర్నూలులో వెహికల్ మౌంటెడ్ లేజర్ డైరెక్టెడ్ వెపన్ (DEW) MK-II(A) యొక్క ల్యాండ్ వెర్షన్‌ని DRDO విజయవంతంగా పరీక్షించింది. దీని ద్వారా ఒక ఫిక్స్డ్ వింగ్ UAV అండ్ స్వార్మ్ డ్రోన్లను విజయవంతంగా నాశనం చేసిందని డీఆర్డీఓ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్‌లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
Read Also: BJP: ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్పై “కన్హయ్య కుమార్” అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఫిర్యాదు..
ఇలాంటి లేజర్ ఆయుధాలు కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. ఇలాంటి లేజర్ ఆయుధం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాల వద్ద మాత్రమే ఉందని, ఇజ్రాయిల్ కూడా ఇలాంటి సామర్థ్యాలపై పనిచేస్తోందని, ఇలాంటి వ్యవస్థ కలిగిన నాలుగో దేశం లేదా ఐదో దేశం భారత్ అని DRDO చైర్మన్ సమీర్ వి కామత్ చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమే అని, మేము అధిక శక్తి మైక్రోవేవ్‌లు, విద్యుదయస్కాంత పల్స్ వంటి ఇతర హై ఎనర్జీ వ్యవస్థలపై కూడా పనిచేస్తున్నామని వెల్లడించారు.
DEW వ్యవస్థ, సుదూర పరిధిలోని ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లను కూల్చివేసింది. మల్టీ డ్రోన్లను అడ్డుకుంది. శత్రువు నిఘా సెన్సార్లు, యాంటెన్నాలను నాశనం చేసింది. మెరుపు వేగంతో దాడి చేయడం, ఖచ్చితత్వం కొన్ని సెకన్లలో లక్ష్యాన్ని నాశనం చేయడం దీని ప్రత్యేకత. రాడార్ ద్వారా లేదా దాని ఇన్‌బిల్ట్ ఎలక్ట్రో ఆప్టిక్(EO) వ్యవస్థ ద్వారా డ్రోన్లను గుర్తించిన తర్వాత లేజర్ కాంతితో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. శక్తివంతమైన కాంతి పుంజాన్ని ఉపయోగించి నాశనం చేయగలదు.
CHESS DRDO conducted a successful field demonstration of the Land version of Vehicle mounted Laser Directed Weapon(DEW) MK-II(A) at Kurnool today. It defeated the fixed wing UAV and Swarm Drones successfully causing structural damage and disable the surveillance sensors. With… pic.twitter.com/U1jaIurZco
— DRDO (@DRDO_India) April 13, 2025
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!