Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News King Cobra Why The Apex Predator Is Key To Balance Of Nature

King Cobra: ప్రమాదం అంచున “కింగ్ కోబ్రా”.. పాముల రారాజు ప్రత్యేకత, ప్రాముఖ్యత తెలుసుకోండి..

Published Date :May 7, 2023 , 11:41 am
By Venu Goapl Reddy
King Cobra: ప్రమాదం అంచున “కింగ్ కోబ్రా”.. పాముల రారాజు ప్రత్యేకత, ప్రాముఖ్యత తెలుసుకోండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

King Cobra: ప్రపంచవ్యాప్తంగా 1,47,517 జంతు జాతులలో 41,459 జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) తన తాజా నివేదికలో పేర్కొంది. అంతరించి పోయే జాతుల జాబితాలో చాలా వరకు మనం పులులు, సింహాలు, చిరుతల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అయితే ఇందులో ‘కింగ్ కోబ్రా’ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ విషపూరిత సర్పం ఇప్పుడు ప్రమాదం అంచున ఉంది.

ప్రపంచంలో ఎన్నో పాముల జాతులు ఉన్నా.. కేవలం ‘కింగ్’ అనే పేరు మాత్రం ఒక్క కోబ్రాకు మాత్రమే సొంతం. ఇతర పాములతో పోలిస్తే దీని ఆహార్యం, జీవించే పద్దతులు ఎంతో గొప్పగా ఉంటాయి. ఇప్పుడు ఈ జాతి దశాబ్ధం క్రితం 2011లో రెడ్ లిస్ట్ లో చేర్చబడింది. దాదాపుగా 5.5 మీటర్ల పొడవు పెరిగే కింగ్ కోబ్రాను ఇప్పుడు రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనదేశంలో ముఖ్యంగా పశ్చిమకనుమలు, తూర్పుకనుమలు, హిమాలయాలు వీటికి ప్రధాన ఆవాసాలుగా ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో ఈ జాతి సంరక్షణ కోసం అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ (ARRS) భాగస్వామ్యం అయింది.

పాముల్లో రారాజు – పర్యావరణ వ్యవస్థకు ఎంతో ముఖ్యం..

కింగ్ కోబ్రాను, ఓపియోఫేగస్ హన్నా అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద విషపూరిత సర్పం. దాదాపుగా 5.5 మీటర్ల వరకు పెరుగుతుంది. చాలా వరకు మానవులకు దూరంగా ఇవి జీవిస్తుంటాయి. పాములు, ఎలుకను ఆహారంగా తీసుకుంటాయి. భారత్ తో పాటు థాయ్ లాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. నిమిషాల్లోనే దీని విషం పక్షవాతం, మరణానికి కారణం అవుతుంది.

ప్రపంచంలో ఎన్నో పాములు ఉన్నా.. కేవలం కింగ్ కోబ్రాకు మాత్రమే గూడు కట్టుకునే అలవాటు ఉంది. ఆడపాములను ఆకర్షించేందుకు మగపాములు తీవ్రమైన పోరాటాల్లో కూడా పాల్గొంటాయి. యుద్దంలో ఓడిపోయిన పాము తన పరిధిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. గూడులోనే ఆడ కింగ్ కోబ్రా గుడ్లను పెడుతుంది. ఎండు ఆకులతో గూడు ఏర్పాటు చేస్తుంది.

కింగ్ కోబ్రాలు పర్యావరణ సమతౌల్యానికి కారణం అవుతున్నాయి. ఇతర పాములను, సరీసృపాలు, ఎలుకను ఆహారంగా తీసుకుంటూ పర్యావరణాన్ని రక్షిస్తోంది. వీటికి ఉంటే అత్యంత తీవ్రమైన వాసన శక్తిని ఉపయోగించి, చురుకుగా వ్యవహరిస్తాయి. పంటలకు నష్టం కలిగించే ఎలుకను చంపి, రైతుకు మేలుగా ఉంటుంది. ఎలుకల జనాభాను నియంత్రిస్తోంది.

King Cobra 2

మానవుడితో సంఘర్షణ:

విస్తృతంగా అడవుల నిర్మూలన కారణంగా కింగ్ కోబ్రాలకు ప్రమాదం ఏర్పడుతోంది. మానవుడితో నిత్యం సంఘర్షణ ఎదుర్కొంటోంది. నిజానికి మానవుడు ఉండే ప్రాంతాలకు చాలా దూరంగా ఈ పాములు నివసిస్తుంటాయి. తనకు ప్రమాదం అని తెలిస్తే తప్పా దాడి చేయవు. అయితే ప్రజలు మాత్రం కింగ్ కోబ్రా కనిపిస్తే చంపేదాకా వదలడం లేదు. ఈ నేపథ్యంలో దీన్ని రక్షించేందుకు రక్షణ చర్యలు జరుగుతున్నాయి. పశ్చిమ కనుమల్లో ఈ జాతిని రక్షించేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. పరిశోధకులు కింగ్ కోబ్రాలను ట్యాగ్ చేస్తున్నారు. ట్యాగింగ్ ద్వారా ఎన్ని పాములు ఉన్నాయి, అవి ఎటు వెళ్తున్నాయనే వాటిని ట్రాక్ చేస్తున్నారు. అవి ఆడపాముల సంభోగం కోసం ఎంత దూరం ప్రయాణిస్తున్నాయనే వివరాలను పరిశోధకులు తెలుసుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • karnataka
  • King cobra
  • Western Ghats

తాజావార్తలు

  • రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

  • Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు

  • Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!

  • MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్

  • Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions