Pakistan: ‘‘ కాశ్మీర్ వెళ్లండి, ఇక్కడేం పని’’.. పాక్ ఆర్మీ, పోలీసుల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్..
- పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ..
- మీ జనరల్ వచ్చినా ఇక్కడ ఏం చేయలేడని హెచ్చరిక..
- కాశ్మీర్ పంపండి ఇక్కడే పని అంటూ ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: 26 మంది టూరిస్టుల్ని బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ భయపడి చస్తోంది. ఇదిలా ఉంటే, పాక్ అంతర్గత పరిస్థితులు కూడా ఆశాజనకంగా లేవు. బలూచిస్తాన్‌లో బీఎల్ఏ, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దెబ్బకు పాక్ సైన్యం తోకముడుస్తోంది. పాక్ సైన్యంలో పంజాబ్ ఆధిపత్యాన్ని ఇతర ప్రాంతాలు సహించడం లేదు.
Also Read
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ఇదిలా ఉంటే, తాజాగా పాక్ ఆర్మీ, ఖైబర్ ఫఖ్తుంఖ్వా పోలీసుల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. లక్కీ మార్వాట్లోని పష్తూన్ పోలీసు అధికారులు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌ని పోలీస్ స్టేషన్లోకి రానివ్వలేదు. పోలీస్ అధికారులు ఆర్మీపైకే ఆయుధాలు ఎక్కుపెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పహల్గాం దాడి తర్వాత నుంచి కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి కూడా పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం వీడియోలో కనిపిస్తోంది.
‘‘మీ దిమాక్ సరిగా పనిచేయడం లేదు. వారిని కాశ్మీర్ పంపండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మీ జనరల్(ఆసిమ్ మునీర్) వచ్చినా, ఏం చేయలేడు. మేం లక్కీ మార్వాట్ పోలీస్ గుర్తుంచుకోండి. ఈ పంబాబ్ వాళ్లు ఇక్కడి వచ్చి నాటకాలు చేస్తున్నారు’’ అని అనడం వీడియోలో చూడవచ్చు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని అంతర్గత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. https://twitter.com/AdityaRajKaul/status/1917554429206880376
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..