Khalistani terrorist: భింద్రన్‌వాలే మేనల్లుడు ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ పాకిస్తాన్‌లో మరణించాడు. భారత వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడుతున్న ఇతను చాలా కాలంగా పాకిస్తాన్‌లోనే ఉంటున్నాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక, ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నాడు. ఇతనికి పాక్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
స్వర్ణ దేవాలయం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే పోస్టర్లతో పాటు కత్తులు దూశారు. శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) నాయకుడు, ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.