Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక అరెస్ట్‌లు.. ఉమర్, షాహీన్‌తో సంబంధాలు
- ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక అరెస్ట్‌లు
- ఉమర్, షాహీన్‌తో సంబంధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వేకొద్దీ ఉగ్ర కుట్ర కోణాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రవాది ఉమర్‌కు సంబంధించిన విషయాల్లో అంతర్జాతీయంగా జరిగిన కుట్ర వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Wedding Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై కత్తి దాడి.. నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
ఇక దర్యాప్తులో భాగంగా కీలక అరెస్ట్‌లు జరిగాయి. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో భాగంగా జమ్మూకాశ్మీర్‌కు చెందిన కార్డియాలజిస్ట్ మహ్మద్ ఆరిఫ్‌ను కాన్పూర్‌లో అరెస్ట్ చేశారు. ఇటీవల అరెస్టైన డాక్టర్ షాహీన్‌తో దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. వీరిద్దరూ నిత్యం టచ్‌లోనే ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు కనిపెట్టారు.
అలాగే ఫహీమ్ అనే మరొక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖండ్వాలీ ప్రాంతంలో ఎరుపు రంగు ఎకోస్పోర్ట్స్ కారును పార్కు చేసిన వ్యక్తిగా గుర్తించి ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫహీమ్.. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ బంధువుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో ముగిసిన షట్‌డౌన్.. బిల్లుపై ట్రంప్ సంతకం
టెర్రర్ మాడ్యూల్ ప్రకారం ఉమర్ మూడు కార్లు కొనుగోలు చేశాడు. హ్యుందాయ్ ఐ20, ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి బ్రెజ్జాలను కొనుగోలు చేశాడు. ఈ మూడు కారుల్లో సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర హ్యుందాయ్ i20 కారు పేలిపోయింది. ఇక రెండో ఎరుపు రంగు కారును తాజాగా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్ 0458 కలిగిన ఎకోస్పోర్ట్‌ను ఫరీదాబాద్‌లో ట్రాక్ చేశారు. ఇక మూడో కారు మారుతి బ్రెజ్జా కోసం గాలిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ మూడు వాహనాల్లో పెద్ద ఎత్తున ఐఈడీలు పెట్టుకుని భారీ దాడులు చేయాలని.. అంతేకాకుండా అస్సాల్ట్ రైఫిల్స్‌తో విచక్షణారహితంగా కాల్పులు కూడా జరపాలని ఉమర్ ప్లాన్ చేసుకున్నట్లుగా దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.
అయోధ్య టార్గెట్..
ఇక ఉమర్ తదుపరి లక్ష్యం అయోధ్య అని తేల్చారు. నవంబర్ 25, 2025న అయోధ్య రామాలయంలో ‘ధ్వజారోహణం’ (జెండా ఎగురవేత) వేడుకతో పాటు ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేసే సమయంలో ఉమర్ దాడి చేయాలని ప్లాన్ వేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
ఇక ఫరీదాబాద్‌లో అమ్మోనియం నైట్రేట్, ఆర్డీఎక్స్ మిశ్రమాన్ని పెద్ద ఎత్తున దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఇది మిలిటరీ-గ్రేడ్ పేలుడు పదార్థాలకు సంబంధించిందిగా తేల్చారు. ఢిల్లీలో పేలిన కారులో ఇవే ఉపయోగించారా? లేదా? అనేది ఫోరెన్సిక్ బృందాలు తేల్చనున్నాయి.
ఇక ఈ కుట్రంతా టర్కీ కేంద్రంగా జరిగినట్లుగా కనిపెట్టారు. 2022లో రూపొందించిన ప్రణాళికగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక ఉమర్.. ప్రస్తుతం ‘ఉకాసా’ అనే కోడ్‌నేమ్‌తో పిలవబడుతున్నాడు. టర్కీలోని హ్యాండ్లర్లు.. ఉమర్‌ను ‘ఉకాసా’గానే పిలుస్తారు. ఉమర్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టినప్పుడు ఈ అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!