Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
- కేరళలో ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై దుమారం..
- మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన సీఎం సతీషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని ఇటీవల కేరళకు చెందిన గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై కేరళ సీఎం వీడీ సతీషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పబ్లిక్‌లోకి వస్తే ‘‘తీవ్ర విధ్వంసం’’ జరుగుతుందని ముస్లిం మతపెద్ద చేసిన వ్యాఖ్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ‘‘ మహిళలు పబ్లిక్‌లోకి వస్తే తీవ్ర నష్టం జరుగుంది. మహిళలు విధేయులుగా ఇళ్లలోనే ఉండాలని ఖురాన్ చెబుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించం. మా ప్రభుత్వం కానీ, మా పార్టీ కానీ ఈ వైఖరికి మద్దతు ఇవ్వదు’’ అని సతీషన్ అన్నారు.
మహిళలు సమాజంలోని అన్ని రంగాల్లో ఉండాలన్నదే తమ ప్రగతిశీల వైఖరి అని కేరళ సీఎం అన్నారు. మహిళలు అణచివేతకు లోనై ఇళ్లకే పరిమితం కావాలన్న భావన 19వ శాతాబ్ధపు ఆలోచన అని అన్నారు. మహిళలు విధేయులుగా ఇళ్లలోనే ఉండాల్సిన అవసరం లేదని, వారు ప్రజా జీవితంలో, సామాజిక జీవితంలో అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు. గ్రాండ్ ముఫ్తీ వ్యాఖ్యలు ఇస్లాం బోధనలకు సరైన ప్రతిరూపం కాదని సతీషన్ అన్నారు. ప్రవక్త మహమ్మద్ తొలి భార్య ప్రముఖ వ్యాపారవేత్త అని, ఆయిషా ‘బ్యాటిల్ ఆఫ్ ది క్యామెల్’లో కీలక పాత్ర పోషించారని, రాణి బిల్కిస్ ఒక పాలకురాలిగా ఉన్నారని గుర్తుచేశారు.
Also Read
గ్రాండ్ ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. మత పెద్ద ఆదేశాలతో కేరళలోని బాలికలను మధ్యయుగపు నిర్భందంలోకి నెట్టలేరని అన్నారు. కాంగ్రెస్, సీపీఎంలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. మహిళలు పితృస్వామ్య భావజాలాన్ని వ్యతిరేకించాలని చెబుతున్న రాహుల్ గాంధీ, గ్రాండ్ ముఫ్తీ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!