Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quinton de Kock: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ మెరుపు శతకంతో టీ20 క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. సెప్టెంబర్ 1న బాసెటెర్రేలో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఆడిన డి కాక్ కేవలం 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో డి కాక్ టీ20 కెరీర్లో 10వ శతకాన్ని నమోదు చేశాడు. 457వ టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన అతని మొత్తం టీ20 పరుగులు 12,867కు చేరాయి. దీంతో టీ20ల్లో 10 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌ల సరసన డి కాక్ నిలిచాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీల రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 22 శతకాలు సాధించగా, పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజం 13 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. డి కాక్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ చెరో 10 శతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే డి కాక్ అద్భుత ఇన్నింగ్స్ బార్బడోస్ విజయానికి మాత్రం సరిపోలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ ట్రైడెంట్స్ డి కాక్ 106 పరుగుల సహకారంతో 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ దూకుడుగా ఆడింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. జాసన్ హోల్డర్ 11 బంతుల్లో రెండు సిక్సర్లతో 18 పరుగులు చేసి అతడికి అండగా నిలిచాడు. చివరికి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. దీంతో బార్బడోస్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వ్యక్తిగతంగా డి కాక్ చరిత్ర సృష్టించినప్పటికీ, అతని శతకం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!