Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
- రైతులు, టీచర్లపై కేసుల్ని ఎత్తేసిన విజయ్ సర్కార్..
- గతంలో ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులు..
- తాము కూడా కేసుల్ని ఎత్తేసిన విషయాన్ని గుర్తుచేసిన డీఎంకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఉపాధ్యాయులపై ఉన్న కేసుల్ని ఎత్తేశారు. జీవనోపాధి, హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా చేపట్టిన ఆందోళనలకు సంబంధించి 2021 మే నుంచి 2026 ఏప్రిల్ మధ్య నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. మానవతా దృక్పథంతో పాటు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
గత ప్రభుత్వం రైతులు, టీచర్లపై అనేక కేసులు నమోదు చేసిందని విజయ్ విమర్శించారు. వారి ప్రజాస్వామ్య హక్కులు హరించబడ్డాయని, కేసుల కారణంగా ఇప్పటికే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు, టీచర్ల న్యాయమైన డిమాండ్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తిరువణ్ణామలై జిల్లాలో పారిశ్రామిక ఎస్టేట్‌కు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ఆందోళనల్ని విజయ్ ప్రశ్నించారు. ఈ నిరసనల్లో కొందరు రైతులపై గుండాస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారని చెప్పారు.
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
పరందూర్‌లో ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనల కేసులను కూడా ఉపసంహరిస్తామని విజయ్ ప్రకటించారు. విమానాశ్రయం కారణంగా వ్యవసాయ భూములు, నీటి వనరులు, జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కేసుల ఉపసంహరణ ప్రజాస్వామ్య హక్కులపై మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలుకు, ప్రభుత్వానికి మధ్య నమ్మకాన్ని పెంచుతుందని విజయ్ అన్నారు.
అయితే, విజయ్ చర్యపై డీఎంకే స్పందించింది. రైతులపై కేసులు విత్ డ్రా చేసుకోవడం ఇదే తొలిసారి కాదని, తమ డీఎంకే ప్రభుత్వ హాయంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన 5000కు పైగా కేసుల్ని ఉపసంహరించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. CAA, మూడు వ్యవసాయ చట్టాలు, కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను తమ ప్రభుత్వం ఉపసంహరించిందని స్టాలిన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!