Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
- కేరళ సీఎంగా వీడీ సతీషన్..
- ఐయూఎంఎల్‌కు తలొగ్గిందని బీజేపీ విమర్శ..
- కాంగ్రెస్ ముస్లిం లీగ్ అంటూ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. వీడీ సతీషన్‌ను గురువారం హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నతల మధ్య పదవి కోసం పోటీ ఉన్నప్పటికీ సతీషన్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఇదిలా ఉంటే, సతీషన్ ఎంపికపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌ను ‘‘ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. యూడీఎఫ్ కూటమిలో కీలక భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఒత్తిడితోనే ఈ ఎంపిక జరిగిందని ఆరోపించింది.
కాంగ్రెస్ ఐయూఎంఎల్‌కు తలొగ్గిందని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. కేరళలో భారీ గెలుపు తర్వాత 10 రోజులకు సీఎం ఎంపిక పూర్తయింది. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలక పాత్ర పోషించిన నాయకుడిగా సతీషన్‌కు పేరుంది. ఐయూఎంఎల్ కూడా సతీషనే ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్‌కు అల్టిమేటం విధించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
కేరళలో కాంగ్రెస్‌కు 63 సీట్లు ఉంటే, ఐయూఎంఎల్‌కు 22 సీట్లు ఉన్నాయి. ఒక వేళ కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్‌ను సీఎంగా నియమిస్తే, ఐయూఎంల్ మద్దతు ఉపసంహరించుకుంటే మ్యాజిక్ ఫిగర్ 71 చేరదు. గతంలో రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రియంకాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్‌లో ముస్లిం లీగ్‌కు గణనీయమైన పరపతి ఉంది. ఈ ప్రాంతంలో 45 శాతం మైనారిటీ ఓటర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!