Site icon NTV Telugu

Kejriwal: రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకోలేదు.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

Kejriwal5

Kejriwal5

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో ఆప్ సంబంధాలు గురించి అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాహుల్‌గాంధీని వివాహం చేసుకోలేదన్నారు. ఓ మీడియా చర్చావేదికలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి, కాంగ్రెస్‌తో భవిష్యత్‌ సంబంధాలపై మీడియా ప్రతినిధి ప్రశ్నించింది. ఈ సందర్భంగా ‘‘నా భవిష్యత్ నా భార్యతోనే ఉంది. నేను రాహుల్‌గాంధీని వివాహం చేసుకోలేదు.’’ అని కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారు. ‘‘మీరు అతనితో నా భవిష్యత్ అడుగుతున్నారు. నాకు అతనితో భవిష్యత్ లేదు.’’ అని కేజ్రీవాల్ కుండబద్ధలు కొట్టారు. రాహుల్ తీరును అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ కూడా ప్రశ్నించారన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల్లో ఆ నేతలిద్దరూ ఆప్‌కే మద్దతు తెలిపారు. అఖిలేష్ ప్రచారం కూడా చేశారు.

ఇది కూడా చదవండి: Delhi Elections: అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..!

నిన్నామొన్నటి దాకా ఇండియాలో కూటమిలో ఆప్, కాంగ్రెస్ భాగంగానే ఉన్నాయి. అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి సంబంధాలు తెగాయి. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ప్రస్తుతం రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక ప్రచారం మూడు రోజులే ముగిలింది. ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలతో వింటర్ సీజన్‌ను హీటెక్కిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Squid Game 3: స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే?

Exit mobile version