NTV Telugu Site icon

Kejriwal: వృద్ధులపై కేజ్రీవాల్ వరాల జల్లు.. అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం

Kejriwal

Kejriwal

కొత్త సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది. అనంతరం గంటల వ్యవధిలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఇక సమయం ఎంతో లేకపోవడంతో ప్రధాన పార్టీలు సన్నద్ధమైపోతున్నాయి. ఇప్పటికే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక బీజేపీ కూడా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఇలా మూడు ప్రధాన పార్టీలు.. నువ్వానేనా? అన్నట్టుగా తలపడబోతున్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవలే మహిళలపై మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ వరాలు జల్లు కురిపించారు. అధికారంలోకి రాగానే మహిళలకు నెలకు రూ.2,100 అందిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా బుధవారం కూడా వృద్ధులకు తీపికబురు అందించారు. 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు అన్ని ఆస్పత్రుల్లో (ప్రైవేటు, ప్రభుత్వ) ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందించేలా ‘సంజీవని యోజన’ అమలు చేస్తామని వెల్లడించారు. వయో వృద్ధుల సంరక్షణ బాధ్యత తమదేనన్నారు. మీరెంతో కష్టపడి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకొచ్చారని వృద్ధులను గూర్చి తెలిపారు.

వృద్ధులు అనారోగ్యానికి గురైతే చికిత్సకు అయ్యే ఖర్చుకు గరిష్ఠ పరిమితి ఏమీ ఉండదని కేజ్రీవాల్‌ వెల్లడించారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా మొదలవుతుందని.. ఆప్‌ కార్యకర్తలే ఇళ్లకు వచ్చి రిజిస్ట్రేషన్‌ చేస్తారని చెప్పారు. వాలంటీర్లు ఇచ్చే కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది తిరిగి అధికారంలోకి రాగానే.. ఉచిత చికిత్స విధానాన్ని అమలు చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వ కాలం.. ఫిబ్రవరి, 2025తో ముగుస్తుంది. దీంతో జనవరిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చని తెలుస్తోంది. జనవరి 6న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ఈసీ ప్రకటించింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్, ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇది కూాడా చదవండి: Prasad Behara: నటి బ్యాక్ టచ్ చేసిన నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్.. రిమాండ్!

ఇది కూాడా చదవండి: TG TET: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల

Show comments