Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Chief Minister: కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ పేరు దాదాఫుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఈయన వైపే ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కేరళ సీఎం అభ్యర్థి, ప్రభుత్వం ఏర్పాటును పరిశీలిస్తున్న పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు తమ నివేదికను పార్టీ చీఫ్ మల్లికార్జన ఖర్గేకు సమర్పించారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజల అభిప్రాయాల ప్రకారం పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని వాస్నిక్, మాకెన్‌లు చెప్పారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
కేరళ సీఎం రేసులో కేసీ వేణుగోపాల్‌తో పాటు వీడీ సతీషన్, రమేష్ చెన్నితాల వంటి వారు కూడా ఉన్నారు. అయితే, కేసీకే అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. 63 ఏళ్ల వేణుగోపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అలాగే అలప్పుజ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఒకవేళ కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా నియమితులైతే ఆయన ఈ సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి రావడానికి నిజమైన సూత్రధారి కేసీ వేణుగోపాల్ అంటూ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. కొత్త సీఎం ప్రమాణస్వీకారం సోమవారం జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. 140 సీట్లు ఉన్న కేరళలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 102 సీట్లను గెలుచుకున్నాయి. ఇందులో కాంగ్రెస్ 63, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ 22, కేరళ కాంగ్రెస్ 07 సీట్లను గెలుచుకున్నాయి.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!