Chiyaan Vikram : రిహార్సల్స్ లో హీరో విక్రమ్ కు ప్రమాదం.. విరిగిన పక్కటెముక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiyaan Vikram : తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తను హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విక్రమ్ హీరోగా పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో కొన్ని ఏళ్ళ క్రితం ఉన్న కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ లుక్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.
Read Also: Ilayaraja : ఇళయరాజా ఇంట్లో విషాదం..
Also Read
మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే దానికంటే ముందు చిత్ర బృందం రిహార్సల్స్ లో పాల్గొన్నట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో విక్రమ్‌కి పక్కటెముక విరిగిందని తెలుస్తోంది. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని సూచించినట్లు సమాచారం. విక్రమ్ ఈ గాయం నుంచి కోలుకున్నాకే షూటింగ్ మొదలవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తుంది. సినిమాలో పశుపతి, డేనియల్, కాల్టాగిరోన్ నటిస్తున్నారు.
Read Also:Kakinada Crime: కాకినాడలో మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్
Thank you for all the love and appreciation #AdithaKarikalan aka #ChiyaanVikram has received and for the astounding response to #PS2 from all over the world. #Chiyaan sustained an injury during rehearsals resulting in a broken rib due to which he will not be able to join his… pic.twitter.com/za6u9IFm08
— Yuvraaj (@proyuvraaj) May 3, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు