Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- కోలారు జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన
- ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి
- జీవితంపై ఆశ కోల్పోయిన బుజ్జి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని కోలారు జిల్లాలో గుండెల్ని పిండేసే దారుణ ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక.. జీవితంపై ఆశ కోల్పోయి ఇద్దరు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆపై తానూ ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. ఈ విషాద ఘటన కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా చింతలహళ్లి జోడి గ్రామంలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా సోమల గ్రామానికి చెందిన బుజ్జి, బాబు దంపతులు కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం కర్ణాటకలోని కోలారు జిల్లాకు వలస వచ్చారు. అక్కడ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు సరస్వతి (4), కుమారుడు హేమశ్రీ (15 నెలలు) ఉన్నారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో ఆ కుటుంబంలో పెద్ద విషాదం నిండింది. గత నెల 10వ తేదీన జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భర్త బాబు మృతి చెందాడు. కట్టుకున్న భర్త హఠాన్మరణంతో భార్య బుజ్జి తీవ్ర మనస్తాపానికి గురైంది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని వెళ్లదీయడం భారంగా భావించింది. భర్త లేని జీవితంపై భరోసా కోల్పోయిన బుజ్జి.. పిల్లలతో సహా చనిపోవాలని గట్టిగా నిర్ణయించుకుంది.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కన్నకూతురు సరస్వతి, పసికందు హేమశ్రీలకు ఊపిరి ఆడకుండా చేసి మంచంపైనే చంపేసింది. బిడ్డలిద్దరూ చనిపోయాక బుజ్జి కూడా ఇంట్లోనే ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే లోపలికి వెళ్లి ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్న పిల్లలను చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న నంగలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి.. నిందితురాలు బుజ్జిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. భర్త చనిపోయిన నెల రోజులకే ఇద్దరు పసిబిడ్డలు కూడా తల్లి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!