Karnataka Minister: ‘‘ఉగ్రవాదులు మతాన్ని అడగలేదు’’.. పహల్గామ్ దాడిపై కాంగ్రెస్ మంత్రి కామెంట్స్..
- ‘‘ ఉగ్రవాదులు మతాన్ని అడగలేదు’’..
- పహల్గామ్ దాడిపై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలంటూ బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Minister: పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో అమాయకపు టూరిస్టులు 26 మంది మరణించారని యావత్ దేశం తీవ్ర బాధలో ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుంబంధ టీఆర్ఎఫ్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఈ దాడికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ ముష్కరులు టార్గెట్ చేయడాన్ని భారత సమాజం తీవ్రంగా ఖండిస్తోంది.
ఇదిలా ఉంటే, కొందరు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో యుద్ధం వద్దని చెప్పడం వివాదాస్పదమైంది. ఇప్పుడు ఆయన క్యాబినెట్‌లోని మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఉగ్రవాదులు దాడికి పాల్పడే ముందు వారి మతాన్ని అడిగారని నేను అనుకోవడం లేదని అన్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. టెర్రరిస్టుల ఎలా వచ్చారంటే..?
కర్ణాటక ఎక్సైజ్ మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్ మీడియాతో మాట్లాడుతూ.. కాల్చుతున్న వ్యక్తి కులం, మతం అడుగుతాడా..? అతను కాల్చి వెళ్లిపోతాడు, ఒకసారి సరిగా ఆలోచించండి. ఉగ్రవాది అక్కడ నిలబడి మతాన్ని అడగడు.’’ అని అన్నారు. ఈ దారుణమైన దాడిప దేశం కలత చెందుతోందని చెబుతూనే, దీనిని మతపరమైన సమస్యగా చిత్రీకరించడానికి కుట్ర జరుగుతోందని మంత్రి ఆరోపించాడు. ‘‘వారు ఉగ్రవాద దాడి చేస్తున్నప్పుడు మతం అడిగలేదని నేను భావిస్తున్నాను. వారు అలా చేస్తే, మతం ఆధారంగా సమస్యను రాజకీయం కాకూడదు’’ అని మంత్రి చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి తిమ్మాపూర్ అనాగరికమైన, దుష్టమై వ్యాఖ్యలు బాధిత కుటుంబాల సమగ్రతను అవమానించాయని అన్నారు. ఇలాంటి సమయంలో కూడా మతపరమైన, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనస్సాక్షిని తాకట్టు పెట్టి, మతతత్వ కాంగ్రెస్ పార్టీ వ్యాపారం చేస్తుందని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!