843 కోట్లతో గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన కర్ణాటక…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ప్రక్రియను చేపట్టింది. గ్లోబల్ టెండర్లను పిలవడం ద్వారా రెండు కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను సేకరించబోతోంది. దీనికోసం 843 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాల్లాగే- కర్ణాటక కూడా కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతోన్నది ఈ రాష్ట్రంలోనే. యాక్టివ్ కేసుల్లో కర్ణాటక.. దేశంలోనే మొదటి స్థానంలో ఉంటోంది
డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవడం వల్ల గ్లోబల్ టెండర్ల ద్వారా వాటిని సేకరించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రయను వేగవంతం చేసింది. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వర్థ నారాయణ సారథ్యంలో ఏర్పాటైన కోవిడ్ టాస్క్‌ఫోర్స్.. గ్లోబల్ టెండర్ల ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. నాలుగు విడతల్లో రెండు కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఒక్కో విడతకు 50 లక్షల డోసుల చొప్పున వ్యాక్సిన్లను సమీకరిస్తామని టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. ఇదే గ్లోబల్ టెండర్ల ద్వారా 75 కోట్ల రూపాయలతో అయిదు లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను కడా సేకరించనున్నట్లు వెల్లడించింది.
Also Read
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
రెండో విడత వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోన్న వారు.. తప్పనిసరిగా 12 వారాల పాటు వేచి ఉండక తప్పదని అశ్వర్థ నారాయణ తెలిపారు. కోవాగ్జిన్ టీకా వేసుకున్న వారికి ఆరు వారాలు, కోవిషీల్డ్ తీసుకున్న వారికి 12 వారాలు వ్యవధి విధించినట్లు పేర్కొన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల్లోపు ఉన్న వారికి వ్యాక్సిన్ అందజేయడంలో ప్రాధాన్యతా క్రమాన్ని రూపొందించుకున్నామని అన్నారు. పోస్టల్, వ్యవసాయ శాఖల్లో పనిచేసే వారు, బ్యాంకు ఉద్యోగులు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, వీధి వ్యాపారులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వారికి అత్యవసరంగా వ్యాక్సిన్లను అందజేయాల్సి అవసరం ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ గుర్తించిందని చెప్పారు
ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం.. కర్ణాటకలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 41,664 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 349 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 21,71,931కి చేరాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఆరు లక్షల మార్క్‌ను దాటాయి. 6,05,494కు చేరుకున్నాయి. జూన్ 10వ తేదీ నాటికి ఈ సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!