ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ప్రక్రియను చేపట్టింది. గ్లోబల్ టెండర్లను పిలవడం ద్వారా రెండు కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను సేకరించబోతోంది. దీనికోసం 843 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాల్లాగే- కర్ణాటక కూడా కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతోన్నది ఈ రాష్ట్రంలోనే. యాక్టివ్ కేసుల్లో కర్ణాటక.. దేశంలోనే మొదటి స్థానంలో ఉంటోంది…