Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టాక్ మార్కెట్లో కొన్ని చిన్న తరహా కంపెనీల షేర్లు ఊహించని రీతిలో వృద్ధి చెందుతూ పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందిస్తుంటాయి. ప్రస్తుత తరుణంలో ‘బ్లూస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్’ షేరు దలాల్ స్ట్రీట్‌లో మల్టీబ్యాగర్‌గా అవతరించి ఇన్వెస్టర్ల సంపదను స్వల్ప కాలంలోనే రెట్టింపు చేసింది. కేవలం గత మూడు నెలల కాలంలోనే ఈ స్టాక్ సుమారు 112 శాతం మేర వృద్ధి నమోదు చేయడం విశేషం.
ఈ అసాధారణ వృద్ధికి ప్రధానంగా కంపెనీకి దక్కిన భారీ కాంట్రాక్టులే కారణం. బ్లూస్ప్రింగ్ అనుబంధ సంస్థ అయిన స్టీగ్ ఎనర్జీ సర్వీసెస్, దిగ్గజ సంస్థ వేదాంత అల్యూమినియం నుంచి రూ.1,437 కోట్ల విలువైన ఐదేళ్ల పవర్ ప్లాంట్ నిర్వహణ ఆర్డర్‌ను కైవసం చేసుకుంది. దీనికి తోడు అంతకుముందే వేదాంత నుంచి రూ.1,219 కోట్లు మరియు రూ.406 కోట్ల విలువైన ఇతర మెయింటెనెన్స్ కాంట్రాక్టులను కూడా సొంతం చేసుకోవడంతో కంపెనీ భవిష్యత్తు ఆదాయాలపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మరోవైపు ప్రముఖ దిగ్గజ ఇన్వెస్టర్ ఆశిష్ ధావన్ ఈ కంపెనీలో తన వాటాను 6.30 శాతానికి పెంచుకోవడం మార్కెట్లో సానుకూల సంకేతాలను ఇచ్చింది. ప్రస్తుతం రూ.1.86 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ సంస్థ ప్రధానంగా ఫెసిలిటీ మేనేజ్మెంట్, టెలికాం, పవర్ సర్వీసెస్ రంగాలలో సేవలందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.124.50 వద్ద ట్రేడ్ అవుతున్న ఈ షేరు, భారీ ఆర్డర్ల అండతో రిటైల్ ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!