Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- కర్ణాటక యువకుడు పృథ్వీరాజ్ సక్సెస్ స్టోరీ..
- ఐఐటీ చదువు లేకున్నా ఎన్విడియాలో జాబ్..
- ఏకంగా ఏడాదికి రూ. 2.6 కోట్ల ప్యాకేజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Success story: ఐఐటీలు, ఎన్ఐటీల్లో చదవితేనే మంచి సాలరీ ప్యాకేజ్ వస్తుందని చాలా మందిలో ఒక భావన ఉంటుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ కుర్రాడు మాత్రం ఈ ఆలోచన చాలా తప్పు అని తేల్చేశాడు. చిన్న గ్రామంలో పుట్టి, స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చదవుకున్న అతను, తన నైపుణ్యాలను నిరంతరం సానపెట్టుకోవడంతో ఎన్విడియా(NVIDIA) లాంటి ప్రసిద్ధి టెక్ దిగ్గజ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఏకంగా ఏడాదికి రూ. 2.6 కోట్ల ప్యాకేజీని అందుకుంటూ చాలా మందికి స్పూర్తిగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఈ యువకుడి సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్రామీణ నేపథ్యం నుంచి అమెరికా వరకు:
కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ బెంగళూర్‌లోని PES యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తన గ్రామానికి పెద్దగా టెక్ సౌకర్యాలు లేవు. ఐఐటీలతో పోలిస్తే చాలా తక్కువ స్థాయి కాలేజీ, అయినా కూడా పృథ్వీ కేవలం క్లాసు రూముల్లో పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, కొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టాడు. తనకు క్లాస్ రూముల్లో భోదించని వాటిని కూడా స్వయంగా నేర్చుకుంటూ తన నైపుణ్యాలను పెంచుకున్నాడు.
Also Read
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ఇంజనీరింగ్ తర్వాత తన ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. ఆర్థిక ఇబ్బందులు, సరైన మార్గనిర్దేశం లేదు. అయినా కూడా ఇవేవీ పృథ్వీ లక్ష్యాలను నీరుగార్చలేదు. టైర్-3 యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం అప్లై చేయడం నుంచి కెరీర్ ప్లానింగ్ వరకు ప్రతీది స్వయంగా నేర్చుకుంటూ ముందుకు సాగాడు. చాలా మందికి ఆర్థిక స్తోమత ఉండీ, గైడెన్స్ ఉండీ కూడా విఫలమవుతున్న ఈ రోజుల్లో పృథ్వీ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
ఎన్విడియాలో జాబ్:
చివరకు అతని కష్టానికి ఫలితం దక్కింది. ఏఐ టెక్నాలజీకి ఆయువుపట్టుగా ఉన్న చిప్ మేకర్ ఎన్విడియా కంపెనీ డీప్ లెర్నింగ్ టీమ్‌లో పృథ్వీకి ఉద్యోగం వచ్చింది. అతనికి ఏడాదికి సుమారు 26 మిలియన్ రూపాయలు (దాదాపు రూ.2.6 కోట్లు) వేతనం లభిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో పేర్కొన్నారు.‘‘ఒకప్పుడు సాంకేతికత కూడా సరిగా అందుబాటులో లేని గ్రామం నుంచి వచ్చిన నేను ఈ స్థాయికి చేరుకోవడం అసాధ్యం అనిపించింది. కానీ ప్రతీ కష్టం, ప్రతీ ఎదురుదెబ్బ నన్ను మరింత కఠినంగా మార్చాయి. ఎన్విడియాలో చేరడంతో నా కల నెరవేరింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఇంజినీర్లతో కలిసి AI, డీప్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది’’ అంటూ తన సక్సెస్ స్టోరీలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..