కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపికే.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగుతోంది.. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు యడియూరప్ప.. దీంతో.. ఢిల్లీలో ఏదో జరుగుతోంది.. యడియూరప్ప రాజీనామా చేయడం ఖాయమనే ప్రచారం జోరుందుకుంది. కరోనా సమయంలోనూ కొంతమంది మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు యడియూరప్పను టార్గెట్ చేయడం.. ఆయన దిగిపోవడం తప్పదని కామెంట్లు వినిపించాయి..
also read : ఫేస్‌బుక్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రజల్ని చంపేస్తోంది..!
మరోవైపు.. నాయకత్వ మార్పుపై స్పందించిన ఆయన.. రాజీనామా ఊహాగానాలను ఖండించారు. కర్ణాటకలో సాగునీటి ప్రాజెక్టుల విషయంపై చర్చించేందుకు మాత్రమే తాను ఢిల్లీకి వచ్చానని.. ఆగస్టులో మరోసారి హస్తినకు వస్తానని పేర్కొన్నారు. మేకెదాటు ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించానని.. కేంద్ర జల వనరులశాఖ మంత్రిని కూడా కలిసి దీనిపైనే మాట్లాడానని.. మేకెదాటు ప్రాజెక్టును సాధించి తీరుతామని యడియూరప్ప స్పష్టం చేశారు. ఇక, పార్టీ అధిష్టానికి తనపై మంచి అభిప్రాయం ఉందని.. కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి తాను ఎంతో కష్టపడ్డానని ఢిల్లీలో వెల్లడించారు.