సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై షూతో దాడికి యత్నించిన ఘటనను ప్రధాని మోడీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. కానీ కర్ణాటకకు చెందిన ఒక బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు మాత్రం.. దాడికి యత్నించిన న్యాయవాది ధైర్యాన్ని ప్రశంసించారు. న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు.