Neeta Pawar Missing: కన్నడ నటుడి సోదరి మిస్సింగ్.. మూడు రోజులైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannada Actor Naveen Krishna Sister Neeta Pawar Went Missing: కన్నడ నటుడు, దర్శకుడు నవీన్ కృష్ణ ఇంట ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆయన సోదరి నీతా పవార్ కనిపించకుండా పోయింది. ఈ నెల 17వ తేదీన ఇంటి నుంచి బయలుదేరిన నీతా.. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా నవీన్ కృష్ణ సోషల్ మీడియా మాధ్యమంగా వెల్లడించాడు. తన సోదరి ఫోటోని షేర్ చేస్తూ.. ఆమెకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నాడు. ఆమె ఆచూకీ తెలిస్తే.. వెంటనే తమకు సమాచారం అందజేయాల్సిందిగా కొన్ని ఫోన్ నంబర్లు కూడా మెన్షన్ చేశాడు. అనంత్ (6364830333), అరుణ్ (9886624340), శ్వేత (8861526185), సునీల్ (9886525251) పేరిట ఫోన్ నంబర్స్ షేర్ చేసి.. తన సోదరి ఆచూకీ లభ్యమైతే, ఆ నంబర్స్‌కి సంప్రదించాలని తన పోస్టులో పేర్కొన్నాడు.
Himanta Biswa Sarma: “షారుఖ్ ఖాన్ ఎవరు..?” అస్సాం సీఎం ప్రశ్న..
Also Read
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
- Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
- Arunachal Pradesh: అరుణాచల్‌లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
నవీన్ కృష్ణ పెట్టిన పోస్టు ప్రకారం.. నీతా పవార్ సుబ్రమణ్యపుర పరిధిలో నివాసం ఉంటోంది. ఆమె అదృశ్యమైన విషయం తెలిసి.. నవీన్ కృష్ణ వెంటనే తన సోదరి ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల వారు, ఆమెకు తెలిసిన బంధుమిత్రుల్ని సంప్రదించాడు. కానీ.. ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. స్వయంగా నీతానే ఇంటి నుంచి వెళ్లిపోయిందా? లేకపోతే ఆమెని మార్గమధ్యంలో ఎవరైనా అపహరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చివరగా ఆమె ఫోన్ సిగ్నల్ ఎక్కడ కట్ అయ్యిందో వివరాల్ని సేకరించి, దాని ఆధారంగా విచారణ చేపడుతున్నారు. ఉన్నపళంగా నీతా పవార్ ఇలా అదృశ్యం అవ్వడంతో.. నటుడు నవీన్ కృష్ణ ఇంట్లో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది.
Guinnis Record: ప్రపంచంలోనే అతి చిన్న స్పూన్.. గిన్నిస్ రికార్డుల్లో చోటు
ఇదిలావుండగా.. ప్రముఖ కన్నడ నటుడు శ్రీనివాస్ మూర్తి తనయుడిగా నవీన్ కృష్ణ బాలనటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. సినిమాలతో పాటు టీవీ షోలకు దర్శకత్వం వహించి, తనకంటూ మంచి గుర్తింపు గడించాడు. కదంబ, అమృతవాణి, దిమాక్, శ్రీహరికథ లాంటి పలు హిట్ సినిమాలలో నటించాడు. త్వరలోనే ‘భూమికే బండ భగవంత్’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
Kamal Kamaraju: ఆ పని చేస్తూ.. పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు
తాజావార్తలు
-
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!