OTT Releases: థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు…ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Releases: వీకెండ్ వచ్చిందంటే చాలామందికి మొదట గుర్తొచ్చేది ఓటీటీ. ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలు చూడాలని ఎదురు చూసే ప్రేక్షకులకు ఈ వారం మంచి వినోదం సిద్ధంగా ఉంది. సస్పెన్స్‌తో ఉత్కంఠపరిచే థ్రిల్లర్లు, మనసును హత్తుకునే ఫీల్ గుడ్ డ్రామాలు, నవ్వులు పంచే రొమాంటిక్ కామెడీలు, స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్లు ఇలా ప్రతి అభిరుచికి తగ్గ సినిమాలు ప్రముఖ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్కు రానున్నాయి. ముఖ్యంగా జూలై 31న వరుసగా నాలుగు సినిమాలు విడుదలవుతుండగా, ఇప్పటికే జూలై 28 నుంచే ఒక ఆసక్తికరమైన ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను అలరిస్తోంది. మరి ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా చూడొచ్చో ఒకసారి తెలుసుకుందాం.
‘బాలన్: ది బాయ్’ (Balan: The Boy)
ZEE5లో జూలై 31న విడుదలయ్యే ‘బాలన్: ది బాయ్’ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా. ఆదిశేషన్ KR, ఫర్జానా పాలతింగల్, ముహమ్మద్ జినాన్, టోవినో థామస్ (అతిధి పాత్ర) నటించిన ఈ సినిమాకి చిదంబరం దర్శకత్వం వహించారు. మహిళల సంరక్షణ కేంద్రంలో ఉండే తల్లి దగ్గర పెరిగిన బాలన్ కథ ఇది. వీళ్ళు బయటకు వచ్చాక వేర్వేరు గుర్తింపులతో జీవించడం, అదే సమయంలో తల్లి కనిపించకపోవడంతో బాలన్ తల్లి కోసం సాగించే అన్వేషణ, సస్పెన్స్ తో ఈ కథ సాగుతుంది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ గా చెప్పుకోవచ్చు.
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
‘చిన్న చిన్న ఆసై’ (Chinna Chinna Aasai)
జియో హాట్‌స్టార్‌లో జూలై 28 నుంచి ఈ ఫీల్ గుడ్ మూవీ శతరేయమింగ్ లోకి వచ్చింది. ఇంద్రన్స్, మధు షా, అపర్ణ బాలమురళి, తంబి రామయ్య నటించిన ఈ సినిమాను వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. తంజావూరు యువతి లీల వారణాసిలో చిక్కుకుపోయి, కేరళ ఉపాధ్యాయుడు మాధవన్‌తో కలిసి గడిపిన ఒక రోజు కథ ఇది. గతాలు, భయాలు, కలలు పంచుకుని ఏర్పడే అనూహ్య బంధంతో కథ హృదయాన్ని తాకేలా ఉంటుంది.
‘గట్టా కుస్తీ 2’ (Gatta Kusthi 2)
ఈ తమిళ స్పోర్ట్స్ యాక్షన్ కామెడీకి చెల్ల అయ్యవు దర్శకత్వం వహించారు. జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ మలయాళ డబ్ మూవీలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, యోగిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. మొదటి భాగం తర్వాత వీర్, కీర్తి దాంపత్య జీవితం ఎలా సాగింది? కుటుంబ బాధ్యతలు, రెజ్లింగ్ కెరీర్ మధ్య వాళ్ళు ఎలా ముందుకు సాగారు. అనే అంశాలను వినోదాత్మకంగా చూపించారు. కుటుంబంతో కలిసి చూసే మంచి ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలవొచ్చు. ఈ మూవీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ కానుంది.
‘పైతలాట్టం’ (Paithalattam)
మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకుల కోసం SunNXTలో జూలై 31 నుంచి ‘పైతలాట్టం’ స్ట్రీమింగ్ కానుంది. ధన్య, జయన్ చేరాల్, సునీల్ సుగడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విబిన్ ఎన్. వేలాయుధన్ దర్శకత్వం వహించారు. పల్లెటూరి కుటుంబ విభేదాలు, ‘తీ చాముండి తెయ్యం’ ఆచారం, గతంలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడే విధంగా కథ సాగుతుంది. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
‘లవ్ ఓ లవ్’ (Love Oh Love)
తమిళ రొమాంటిక్ ‘లవ్ ఓ లవ్’ మూవీ ప్రైమ్ వీడియోలో జూలై 31 నుంచి అందుబాటులోకి రానుంది. ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, తెలంగాణ జానపద గీతాలతో గుర్తింపు పొందిన నాగదుర్గ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో కేవలం మూడు వారాల్లోనే ఓటీటీ బాట పట్టింది ఈ మూవీ. మాగేష్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ, ప్రేమించిన అమ్మాయిని సంతోషంగా ఉంచేందుకు అప్పులు చేసి, ఉద్యోగం కోల్పోయిన యువకుడి జీవితాన్ని సరదాగా చూపిస్తుంది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడలో కూడా అందుబాటులో ఉంది.
మొత్తంగా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం అందించే లైనప్ సిద్ధమైంది. సస్పెన్స్ కావాలంటే ‘బాలన్: ది బాయ్’, రొమాంటిక్ కామెడీ కావాలంటే ‘లవ్ ఓ లవ్’, మనసును హత్తుకునే కథ కోసం ‘చిన్న చిన్న ఆసై’, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ‘గట్టా కుస్తీ 2’, థ్రిల్లింగ్ కోసం ‘పైతలాట్టం’ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఈ వీకెండ్ మీకు నచ్చే సినిమా ఏదో ఓటీటీలో ఎంచుకుని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!