Income Tax Return 2026: మరో రెండు రోజులే గడువు.. ఆలస్యమైతే రూ.5,000 వరకు జరిమానా.. ఇతర ఇబ్బందులు తప్పవు..!
- ITR ఫైలింగ్‌కు మరో రెండు రోజులే..
- ఆలస్యమైతే రూ.5,000 వరకు జరిమానా..
- జూలై 31లోగా ITR దాఖలు చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Income Tax Return 2026: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కీలక హెచ్చరిక. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేందుకు గడువు ముగియనుంది. ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించిన ప్రకారం జూలై 31 చివరి తేదీ. ఇప్పటికే కోట్లాది మంది తమ ఐటీఆర్‌ను దాఖలు చేసినప్పటికీ, ఇంకా పూర్తి చేయని వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేస్తూ, చివరి నిమిషం వరకు వేచి ఉండవద్దని ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా వేదిక X ద్వారా కూడా నిరంతరం అవగాహన కల్పిస్తోంది.
గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం, వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించి ఉన్న పన్ను చెల్లింపుదారులు ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే రూ.5,000 వరకు జరిమానా విధించబడుతుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. జరిమానాతో పాటు ఇతర ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. పన్ను బకాయిలు ఉంటే సెక్షన్ 234A ప్రకారం బకాయి మొత్తంపై నెలకు 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆలస్యంగా దాఖలు చేసిన రిటర్న్‌ల ప్రాసెసింగ్ కూడా ఆలస్యం కావడంతో, రీఫండ్ కోసం ఎదురుచూసే వారికి డబ్బు అందడంలో జాప్యం ఏర్పడుతుంది.
Also Read
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
అంతేకాదు, ఐటీఆర్‌లో ఆదాయాన్ని దాచిపెట్టడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేయడం లేదా పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి మూడు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇంకా ఐటీఆర్ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి జరిమానాలు, వడ్డీలు, చట్టపరమైన సమస్యలను నివారించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది.
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?