Gyanvapi: జ్ఞానవాపీ మసీదు సర్వేకి ఆదేశించిన జడ్జికి బెదిరింపు కాల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi: జ్ఞానవాపీ మసీదు వివాదంలో ఆ ప్రాంతాన్ని సర్వే చేయాలని 2022లో ఆదేశాలు జారీ చేసిని వారణాసి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్‌కి అంతర్జాతీయ నెంబర్ల నుంచి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీనిపై పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదైంది. 2022లో ఈ జ్ఞానవాపీ మసీదు ప్రాంగణాన్ని వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆయన ఆదేశించారు. ఈ బెదిరింపులపై బరేలీ ఎస్పీకి ఆయన లేఖ రాశారు. తనకు ఏప్రిల్ 15న ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందని, రెండ్రోజుల తర్వాత కూడా ఇలాంటిదే మరో కాల్ వచ్చిందని, తనకు ప్రాణహాని ఉందని జస్టిస్ దివాకర్ పేర్కొన్నారు. ఇటీవల బరేలీకి వదిలి అయిన ఆయన తన కుటుంబానికి కూడా బెదిరింపులు వచ్చాయని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు.
Read Also: Election Phase 2: రేపు రెండో విడత పోలింగ్.. రాహుల్ గాంధీ, శశిథరూర్‌తో పాటు పోటీలో కీలక వ్యక్తులు..
Also Read
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
- PM Modi: డ్రగ్స్‌కు దూరంగా యువత.. వికసిత్ భారత్‌కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
బరేలీకి బదిలీ అయిన తర్వాత, జస్టిస్ దివాకర్ 2018 బరేలీ అల్లర్ల కేసును సుమోటోగా తీసుకున్నారు. ఈ అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా ఉన్న మౌలానా తౌకీర్ రజాను విచారణ ఎదుర్కోవాల్సిందిగా ఆదేశించారు. ఈ అల్లర్లలో కోట్లాది రూపాయలన ఆస్తి నష్టం వాటిల్లింది. బరేలీలో 27 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు.
ఇదిలా ఉంటే, ఏప్రిల్ 2022లో కాశీ విశ్వనాథ మందిరాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపీ మసీదులో వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించారు. ఈ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోడలపై హిందూ దేవీదేవతల చిత్రాలతో పాటు మసీదు సముద్రాంలో వజూఖానాలోని కొలనులో శివలింగం ఆకారం బయటపడింది. అయితే, దీనిని హిందువలు శివలింగం అని చెబుతుండగా.. ముస్లింలు మాత్రం ఇది ఫౌంటేన్ అని చెబుతున్నారు. బెదిరింపులపై జస్టిస్ దివాకర్‌కి అలహాబాద్ హైకోర్టు వై-కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించింది, ఆ తర్వాత ఎక్స్-కేటగిరీకి తగ్గించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
-
Jofra Archer: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
-
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్‌ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!