Muslim mob drives Dalit families out of village in Jharkhand: జార్ఖండ్ లో దారుణం జరిగింది. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో నివసిస్తున్న దళిత కుటుంబాలు తరిమికొట్టారు కొంతమందితో కూడిన ముస్లిం గుంపు. 50 దళిత కుటుంబాలు బలవంతంగా ఊరును ఖాళీచేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. జార్ఖండ్ పాలము జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్నారు పోలీసులు. గవర్నర్ రమేష్ బైస్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నివేదిక సమర్పించాలని గవర్నర్ కార్యాలయం పోలీసులను ఆదేశించింది.
ప్రస్తుతం ఈ సమాచారం అందుకున్న మేదీనీనగర్ ఎస్డీఓ, ఇతర పోలీసు అధికారులు మరుమటు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 12 మంది వ్యక్తులతో పాటు 150 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు మంగళవారం పోలీసులు వెళ్లడించారు. నింితులను వెంటనే పట్టుకోవాలని పాలము డిప్యూటీ కమిషనర్ పోలీసులను ఆదేశించారు. ఇదే గ్రామంలో 50 కుటుంబాలకు ప్రాధాన్యత క్రమంలో పునరావాసం కల్పిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితు కుటుంబాలన్నీ ‘ముషార్’ కులానికి చెందిన వారు. దాదాపుగా నాలుగు దశాబ్ధాల నుంచి గ్రామంలో నివసిస్తున్న దళితులు ప్రస్తుతం గ్రామాన్ని ఖాళీ చేశారు.
Read Also: CM KCR Bihar Tour: బీహార్ సీఎంతో కలిసి చెక్కులు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్
గత దశాబ్ధకాలం నుంచి మేమంత కలిసి నివసిస్తున్నామని.. అయితే మరుమటు గ్రామంలో చాలా మంది ప్రజలు సోమవారం మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారని.. మా వస్తువులను వాహనాల్లో ఎక్కించుకుని సమీపంలోని అడవిలో పారేశారని బాధితుల్లో ఒకరైన జితేంద్ర ముషార్ తెలిపారు. పోలీసులను ఆశ్రయిస్తే తమపై కూడా దాడి చేశారని.. ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటనలో సంబంధం ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేట సాగిస్తున్నారు. బాధ్యలను విడిచిపెట్టబోం అని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు పోలీసులు