Bihar Politics: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో ఎన్డీయేలో భాగంగా బీజేపీతో పొత్తులో ఉన్న నితీష్ కుమార్ జేడీయూ పార్టీ.. ఆ పొత్తు కాదనుకుని లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో జతకట్టింది. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గతం నుంచి బీహార్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. జేడీయూ చీల్చి అధికారం ఏర్పాటు చేయాలనుకుంటుందనే ఆరోపణతోనే సీఎం నితీస్ కుమార్ బీజేపీ పొత్తును కాదనుకున్నాడు.
Read Also: Man Chops Private Part: వీడెవడండీ.. పెళ్లాం రావడం లేదని దాన్నే కోసేసుకున్నాడు..
ఇదిలా ఉంటే ప్రస్తుతం జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహాను బీజేపీ నేతలు కలవడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన జేడీయూ నుంచి బీజేపీలోకి చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జేడీయూ పార్లమెంటరీ బోర్డు చీఫ్ గా ఉన్న ఉపేంద్ర కుష్వాహా అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు శుక్రవారం ఆయనను కలిశారు. ఈ ఫోటో ప్రస్తుత బీహార్ వ్యాప్తంగా వైరల్ గా మారింది. కుష్వాహాను బీజేపీలోకి ఆహ్మానిస్తామని రాష్ట్ర బీజేపీ పేర్కొంది.
బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వంలో ఉపేంద్ర కుష్వాహా మంత్రిగా ఉన్నారు. అభివృద్ధి, జాతీయవాద రాజకీయాల వైపు మొగ్గు చూపే నేతలంతా మా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. రొటీన్ చెకప్ కోసం ప్రస్తుతం ఎయిమ్స్‌లో చేరిన కుష్వాహను బీజేపీ నేతలు ప్రేమ్ రంజన్ పటేల్, సంజయ్ టైగర్, యోగేంద్ర పాశ్వాన్ పరామర్శించారు. జేడీయూలోకి తిరిగి రావడానకి కుష్వాహా తన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీని(ఆర్ఎల్ఎస్పీ)ని జేడీయూలో రెండేళ్ల క్రితం విలీనం చేశారు. ఇటీవల కుష్వాహా తాను డిప్యూటీ సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించారు. అయితే సీఎం నితీష్ కుమార్ దీన్ని కొట్టి పారేశారు. అయితే అతను బీజేపీలో చేరకున్నా.. ఓ కొత్త పార్టీని ప్రారంభించి ఎన్డీయేలో చేరే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.