Japanese Encephalitis: అస్సాంలో వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి (Japanese Encephalitis) విజృంభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 35 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు. ఈ వ్యాధి వల్ల మెదడులోని నాడీ కణాల్లో వాపు ఏర్పాటుతో వాటి పనితీరులో అవరోధాలు ఏర్పాడతాయి. మెదడువాపు సోకిన వారిలో సాధారణంగా తలనొప్పి, జ్వరం, వాంతులు, మతిస్థిమితం తప్పడం, అపస్మారక స్థితి, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
జులైలో ఇప్పటివరకు మొత్తం 226 జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసులు కనుగొనబడ్డాయి. ఈ వ్యాధి అస్సాంలో గత 24 గంటల్లో మరో ముగ్గురు ప్రాణాలను బలిగొందని నేషనల్ హెల్త్ మిషన్ వెల్లడించింది. దీంతో ఈ వ్యాధి బారినపడి మృతిచెందిన వారి మొత్తం సంఖ్య 35కి చేరుకుంది. ఇవాళ మొత్తం 24 కొత్త కేసులను నివేదించింది. 24 కొత్త కేసుల్లో నాగావ్, బిస్వనాథ్ జిల్లాలో 4 చొప్పున, జోర్హాట్ జిల్లాలో 3, ధేమాజీ, కమ్రూప్, లఖింపూర్, నల్బరీ, సోనిత్‌పూర్, బక్సా, చిరాంగ్ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
జపనీస్ మెదడువాపు వ్యాధి మొదటి కేసు 1871లో జపాన్‌లో నమోదు చేయబడింది. మెదడువాపు సోకిన వారిలో సాధారణంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. అనంతరం ఇన్‌ఫెక్షన్ సోకి అనారోగ్యానికి దారితీస్తాయి. పిల్లలలో, జీర్ణాశయాంతర నొప్పి, వాంతులు ప్రధాన ప్రారంభ లక్షణాలు కావచ్చు. తీవ్ర వ్యాధి లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, మెడ దృఢత్వం, దిక్కుతోచని స్థితి, కోమా, మూర్ఛలు, పక్షవాతం, చివరికి మరణం కూడా సంభవించవచ్చు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిలో మరణాల రేటు 30 శాతం వరకు ఉంటుంది. జీవించి ఉన్నవారిలో, 20 శాతం నుంచి 30 శాతం మంది పక్షవాతం, పునరావృత మూర్ఛలు, మాట్లాడలేకపోవడం వంటి శాశ్వత మేధో, ప్రవర్తనా లేదా నాడీ సంబంధిత పరిణామాలతో బాధపడుతున్నారు.
Railway Shock: సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్.. ?
వ్యాధిని నివారించడానికి సురక్షితమైన, సమర్థవంతమైనటీకాలు అందుబాటులో ఉన్నాయి. నిఘా మరియు రిపోర్టింగ్ మెకానిజమ్‌లను బలోపేతం చేయడంతో పాటుగా, వ్యాధి గుర్తించబడిన ప్రజారోగ్య ప్రాధాన్యత ఉన్న అన్ని ప్రాంతాల్లో నియంత్రణ కార్యకలాపాలను కలిగి ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుంది.