Japanese Encephalitis: అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్లలో ‘‘జననీస్ ఎన్సెఫాలిటిస్)(JE)’’ ఒకటి. సాధారణంగా ‘‘మెదడు వాపు’’ వ్యాధిగా పిలిచే ఈ ప్రాణాంతకమైన వ్యాధి 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కనిపించింది. దశాబ్ధం తర్వాత మొదటి కేసు నమోదైనట్లు మున్సిపల్ ఆరోగ్య విభాగం గురువారం వెల్లడించింది.పశ్చిమ ఢిల్లీలోని బిందాపూర్‌కు చెందిన 72 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. నవంబర్ 3న ఛాతీ నొప్పి రావడంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు.
JAPANESE ENCEPHALITIS IN ASSAM: అస్సాం రాష్ట్రాన్ని వరసగా విపత్తులను ఎదుర్కొంటోంది. గతంలో వరదల కారణంగా అస్సాం అతలాకుతలం అయింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్(బ్రెయిన్ ఫీవర్) కలవరపెడుతోంది. అస్సాంలో ఈ వ్యాధితో బాధపడుతూ చాలా మంది మరణిస్తున్నారు. వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అస్సాంలో వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి (Japanese Encephalitis) విజృంభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 35 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు.
వరదలు, భారీ వర్షాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అస్సాం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్ ( జేఈ ) వ్యాధి కలవరపెడుతోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మనుషుల్లో తీవ్రమైన మెదడు వాపుకు కారణం అవుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పితో బాధితులు బాధపడుతుంటారు. సరైన సమయంలో వైద్యం అందకపోతే వ్యాధి చికిత్సకు లొంగే పరిస్థితి ఉండదు. తాజాగా ఈ వ్యాధి అస్సాం రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులకు కారణం అవుతోంది. ఇప్పటి వరకు జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి కారణంగా 15…