Prashant kishor: 14 రోజుల తర్వాత ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష విరమణ
- 14 రోజుల తర్వాత ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష విరమణ
- బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా దీక్ష చేపట్టిన జన్ సూరాజ్ పార్టీ అధినేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గురువారం విరమించారు. జనవరి 2 నుంచి ఈ దీక్ష చేస్తున్నారు. బీహార్‌లోని మెరైన్ డ్రైవ్‌లోని సత్యాగ్రహ స్థలంలో నిరాహార దీక్షను విరమించారు. బీపీఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవలను నిరసిస్తూ అభ్యర్థులకు మద్దతుగా నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఎట్టకేలకు 14 రోజుల తర్వాత నిరాహార దీక్ష విరమించి.. విద్యార్థులకు అండగా ఉంటానని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Justin Trudeau: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాలకు ట్రూడో గుడ్ బై..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
దీక్ష విరమణ అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. 14 రోజులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపినట్లు వెల్లడించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగినప్పుడు తాను గార్దానీబాగ్‌కు వెళ్లి తన గొంతు విప్పినట్లు చెప్పారు. అయినా ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా లాఠీఛార్జ్ చేసిందన్నారు. పలుమార్లు లాఠీఛార్జ్ చేయడం వల్లే నిరాహార దీక్షకు కూర్చోవల్సి వచ్చిందన్నారు.
ఇది కూడా చదవండి: Allahabad HC: భార్య “మద్యం” సేవించడం ఒక్కటే విడాకులకు కారణం కాదు..
విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన అధికారులపై రెండు రోజుల్లో హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. విద్యార్థులకు అనుకూలంగా తీర్పు రాకపోతే.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేసిన అధికారులను వదిలిపెట్టమని చెప్పారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సత్యాగ్రహం చేస్తామన్నారు. రెండు రోజుల్లో రిట్ పిటిషన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. పోరాటంలో పాల్గొనేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఇక బీహార్‌లోని రైతులు… హర్యానా, పంజాబ్ రైతుల తరహాలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిరాహార దీక్షకు ముగింపు పలుకుతూ పవిత్ర గంగానదిలో కిషోర్ స్నానం చేశారు.
ఇది కూడా చదవండి: Brahmanandam: శేఖర్ కమ్ముల సినిమా రిజెక్ట్ చేసిన బ్రహ్మానందం కొడుకు !
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!