JeM Chief Warning PM Modi: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఆపరేషన్ సింధూర్ తో జైషే మహమ్మద్ స్థావరం నామరేపల్లేకుండా పోయింది. దీంతో మసూద్ అజహర్ కుటుంబంలో దాదాపు 14 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో జైషే చీఫ్ మసూద్ అజహర్ సోదరి, బావ, మేనల్లుడు ఉన్నట్లు తెలుస్తుంది.
Read Also: Operation Sindoor: భారత్ మెరుపు దాడి.. హఫీజ్ ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత
ఈ దాడి జరిగిన తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఓ లేఖను విడుదల చేశారు. ఇక, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విషం కక్కుతూ సదరు లేఖను మసూద్ విడుదల చేశారు. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియామాలు ఉల్లంఘించారు అని తీవ్రంగా మండిపడ్డారు. నాకు భయం లేదు, నిరాశ లేదు, విచారం లేదంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే, ప్రధాని మోడీని, భారతదేశాన్ని నాశనం చేస్తానంటూ హెచ్చరించారు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తానంటూ మసూద్ అజహర్ లేఖలో ప్రస్తావించారు.