Jairam Ramesh Comments On Congress Party After Jodo Yatra: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే.. ఏ ప్రతిపక్ష కూటమికైనా కాంగ్రెస్ పార్టీనే ‘అధిపతి’గా ఉంటుందన్నారు. ఎందుకంటే.. పాన్-ఇండియా ఉనికిని కలిగి ఉన్న ఏకైక రాజకీయ శక్తి కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలో సొంతంగా పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ చేపట్టిన భారీ క్రాస్ కంట్రీ మార్చ్ తర్వాత ప్రతిపక్ష కూటమికి ఆధారం కాగలదా అని ప్రశ్నిస్తే.. కచ్ఛితంగా ఆధారం అవుతుందని ఆయన సమాధానం ఇచ్చారు. ఈరోజుకి కాంగ్రెస్ ఏకైక జాతీయ రాజకీయ పార్టీ కాబట్టి.. ప్రతిపక్ష కూటములకు పెద్ద దిక్కు అవుతుందన్నారు.
Tik Tok Ban: టిక్ టాక్ బ్యాన్.. బిల్లు ప్రవేశపెట్టనున్న యూఎస్ గవర్నమెంట్
ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండకపోవచ్చు కానీ.. ప్రతి గ్రామం, మొహల్లా, పట్టణం, నగరంలో ఉనికిని పరిశీలిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబాలు కచ్ఛితంగా కనిపిస్తాయని జైరా రమేశ్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉండొచ్చు కానీ, సంపూర్ణ ఉనికి పరంగా కాంగ్రెస్ మాత్రమే జాతీయ రాజకీయ శక్తి అని తెలిపారు. “మన ప్రభావాన్ని మనం పాలించే రాష్ట్రాల సంఖ్య లేదా మనకు వచ్చే ఓట్ల శాతాన్ని బట్టి కొలవడం చాలా సంకుచిత దృక్పథం. కాంగ్రెస్ సిద్ధాంతం కేంద్రం. ఇది కేంద్ర-వామపక్ష పార్టీ. ప్రతి పార్టీ దాని చుట్టూ తిరుగుతుంది. కాంగ్రెస్ దృక్కోణం, మధ్యేమార్గం, ఏకాభిప్రాయం, సయోధ్య మార్గం’’ అని చెప్పారు. ఎన్ని ప్రతిపక్ష కూటములు వచ్చినా.. తమదే ముఖ్యపాత్ర అవుతుందన్నారు. అయితే.. కాంగ్రెస్ ఒంటరిగా బీజేపీని ఎదుర్కోవాలని తాను కోరుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. కానీ.. ఇది 2024లో సాధ్యం కాకపోవచ్చని ఆయనన్నారు. 2029లో మాత్రం అది సాధ్యం కావొచ్చన్నారు.
Chahat Khanna: సుకేశ్‌పై టీవీ నటి బాంబ్.. ట్రాప్ చేసి, జైలుకి పిలిపించి..
జైరాం రమేశ్ మాట్లాడుతూ.. 2029లో తాము ప్రతి రాష్ట్రంలో సొంతంగా పోరాడటానికి సిద్ధం కావాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చిందని, ఇది సంస్థ నిర్మాణానికి హానికరమని అన్నారు. మొదట సంస్థను నిర్మించాలనేది రాహుల్ గాంధీ ముఖ్య సందేశం అన్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ మళ్లీ ఊపిరి పీల్చుకోగలిగిందని, అయితే, ఇది నిలకడగా ఉండాలని కోరారు. భారత్ జోడో యాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఆత్మవిశ్వాసం నింపిందని.. కాంగ్రెస్ కార్తకర్తలను ఒక లక్ష్యం దిశగా అడుగులు వేయడంలో ప్రేరణ కల్పించిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందుకు కసరత్తు చేయాల్సి ఉంటుందని, లేకపోతే ఈ యాత్రం ఒక ఎపిసోడ్‌గా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ యాత్రం కేవలం ఒక ఈవెంట్ కాదని.. ఇదో ఉద్యమమని.. దీనిని యాత్రగా కాకుండా ఉద్యమంగా పరిగణించాలని అన్నారు.
Nandamuri Tarakaratna: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. వైద్యులు ఏమన్నారంటే..?
ఈ భారత్ జోడో యాత్రం కాంగ్రెస్‌కు ఒక గొప్ప బూస్టర్ డోస్‌గా మారిందని.. ఐదు నెలల క్రితం కంటే ఇప్పుడు ప్రజలు భిన్నమైన కోణంలో కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారని జైరాం రమేశ్ అన్నారు. ప్రజల్లో గాంధీ ఇమేజ్ పరివర్తన చెందడం కూడా బోనస్ అని అన్నారు. అయితే.. రాహుల్‌పై బీజేపీ దుష్ప్రచారం చేయడం ఆపదని, వారి ఏకైక అస్త్రం దూషించడమేనని విమర్శించారు. పార్టీలో తాము ఏదైతే మార్పు కోరుకున్నామో.. ఈ యాత్రతో అది సాధ్యపడిందన్నారు. గత 140 రోజుల్లో కాంగ్రెస్‌లో గణనీయమైన మార్పులొచ్చాయన్నారు. భారత్ జోడో యాత్రకు ముందు కాంగ్రెస్‌తో పోలిస్తే.. యాత్ర తర్వాత కాంగ్రెస్ పూర్తిగా భిన్నమైనదని ఆయన పేర్కొన్నారు.