Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ నోట మళ్లీ “ఖలిస్తాన్” మాట.. తన తల్లి వ్యాఖ్యలపై మండిపాటు..
- ఎంపీ అయిన తర్వాత కూడా తీరు మార్చుకోని అమృత్‌పాల్ సింగ్..
- మళ్లీ ఖలిస్తాన్‌కి మద్దతుగా కీలక వ్యాఖ్యలు..
- తన తల్లి వ్యాఖ్యల్ని ఖండించిన వేర్పాటువాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాది, ఇటీవల ఎంపీగా గెలిచిన అమృత్‌పాల్ సింగ్ మరోసారి ‘ఖలిస్తాన్’కి మద్దతుగా మాట్లాడారు. ఇటీవల తన తల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన కొడుకు ఖలిస్తానీ మద్దతుదారు కాదని, అతడిని విడుదల చేయాలని అమృత్‌పాల్ సింగ్ తల్లి కోరారు. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కేసులో, యూఏపీఏ చట్టం కింద అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్, ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రమాణస్వీకారం కోసం నాలుగు రోజుల పెరోల్తో విడుదలయ్యారు.
ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజు తర్వాత ఆయన తన తల్లి వ్యాఖ్యలపై మాట్లాడారు. ఖలిస్తాన్ డిమాండ్ కోసం మరోసారి నోరు విప్పారు. ‘‘ ఖల్సా రాష్ట్రం గురించి కలలు కనడం నేరం కాదు’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘ నిన్న మా అమ్మ ఇచ్చిన స్టేట్‌మెంగ్ గురించి తెలియగానే చాలా బాధపడ్డా.. అనుకోకుండా మా అమ్మ ఈ వ్యాఖ్యలు చేసిందని అనుకుంటున్నాను. కానీ ఇలాంటి ప్రకటన మా కుటుంబం, లేదా మద్దతు ఇచ్చే వ్యక్తుల నుంచి రాకూడదు’’ అని అన్నారు.
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
Read Also: Nepal: నేపాల్‌లో వరదల బీభత్సం.. 14 మంది మృతి, 9 మంది మిస్సింగ్..
‘‘ఖల్సా దేశం గురించి కలలు కనడం నేరం కాదు. అది గర్వించదగిన విషయం, లక్షలాది మంది సిక్కుల తమ జీవితాలను త్యగాం చేసిన మార్గం నుంచి వెనక్కి తగ్గడం గురించి మనం కలలో కూడా ఊహించలేము’’ అని అన్నారు. శుక్రవారం అమృత్‌పాల్ సింగ్‌తో పాటు ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘ఇంజనీర్ రషీద్’’ అని పిలువబడే షేక్ అబ్దుల్ రషీద్ లోక్‌సభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అమృత్ పాల్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి, రషీద్ జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి గెలుపొందారు.
2023లో అమృత్‌పాల్ సింగ్ అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. పలువురు అధికారులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనలో తన అరెస్టైన తన అనుచరుల్ని విడిపించుకు వెళ్లాడు. ఈ ఘటన తర్వాత పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు అమృత్‌పాల్ సింగ్‌పై కన్నెర్ర చేశాయి. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే అనుచరుడినని చెప్పుకునే అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు నెల రోజుల పాటు వేట సాగించారు. చివరకు పంజాబ్‌లో మోగాలో గతేడాది అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతడిని అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..