Himanta Biswa Sarma: కాంగ్రెస్ మేనిఫెస్టో భారత్ కోసం కాదు, పాకిస్తాన్ కోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో భారత్ కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ ఎన్నికలకు సరిపోతుందని శనివారం ఆరోపించారు. మరోవైపు, లౌకిక, సమ్మిళిత తత్వాన్ని బీజేపీ అర్థం చేసుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడటమని తమ మేనిఫెస్టో లక్ష్యమని చెప్పింది.
Read Also: Minister Buggana Rajendranath Reddy: నీకు నచ్చిన ఆట ఏదైనా చెప్పు నేను రెడీ.. గెలువు చూద్దాం..!
Also Read
- Varanasi Airport Gunfire: ఎయిర్‌పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
- CAG Railway Report: రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా?.. CAG రిపోర్ట్‌లో సంచలన విషయాలు
- PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
- Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సమాజాన్ని విభజించే లక్ష్యం పెట్టుకుందని ఆరోపించారు. ఇది బుజ్జగింపు రాజకీయమని, ఇది భారత ఎన్నికల కోసం కాదని, పాకిస్తాన్ ఎన్నికల మేనిఫెస్టోలా కనిపిస్తోందని విమర్శించారు. దేశంలో ఏ వ్యక్తి అయినా, హిందువు లేదా ముస్లింలు అయినా ట్రిపుల్ తలాక్ పునరుద్ధరణ కోరుకోరని, బాల్య వివాహాలు, బహుభార్యత్వానికి మద్దతు ఇవ్వరని ఆయన అన్నారు. సమాజాన్ని విభజించి అధికారంలోకి రావాలనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు. అస్సాం రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని హిమంత శర్మ అన్నారు.
శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని విడుదల చేసింది. 5 ‘‘పిల్లర్స్ ఆఫ్ జస్టిస్’’ కింద 25 హామీలను ప్రకటించింది. రైతులకు ఎంఎస్పీ కల్పించడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లకు 50 శాతం కన్నా పరిమితి పెంపుకు రాజ్యాంగ సవరణ, దేశవ్యాప్తంగా కులగణణ, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయడం వంటి హామీలను ఇచ్చింది.
తాజావార్తలు
-
Himanshi Khurana: మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
-
Varanasi Airport Gunfire: ఎయిర్‌పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
-
Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
-
BSF Jawan: ‘ఆమె పైకప్పు నుంచి పడిపోయింది’.. భార్యను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు BSF జవాన్ ప్రయత్నం?
-
Shradha Kapoor : సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ రెమ్యునరేషన్ డీల్
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!