Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
- కేరళలో ముదిరిన కాశీ కేఫ్ ‘‘బీఫ్’’ వివాదం..
- బీఫ్ వడ్డిస్తున్నారన్న యూట్యూబర్‌పై కేసు ..
- కాంగ్రెస్ సర్కార్ తీరును ప్రశ్నించిన బీజేపీ..
- అన్ని మతాలతో ఇలాగే వ్యవహరిస్తారా అని సీఎంను ప్రశ్నించిన రాజీవ్ చంద్రశేఖర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kashi Art Cafe Row: కొచ్చిలోని కాశీ ఆర్ట్ కేఫ్ వివాదం రాజకీయంగా మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. ఉత్తరాదికి చెందిన యూట్యూబర్ అమృత్ సింగ్ డారెన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాశీ కేఫ్‌లో గాంధీ బొమ్మ పక్కనే మహ్మద్ అలీ జిన్నా విగ్రహం కూడా ఉందని, కేఫ్‌లో బీఫ్ వడ్డిస్తున్నారనే వీడియోను పోస్ట్ చేశారు. అయితే, దీనిపై కేరళ ప్రభుత్వం మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాడని డారెన్‌పై కేసు పెట్టారు. అయితే, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మత సామరస్యం గురించి మాట్లాడుతున్న సీఎం వీడీ సతీషన్, అన్ని మతాల విశ్వాసాలు, మనోభావాల పట్ల సమానంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. ఆయన వైఖరిని ‘‘సెలెక్టివ్ సెక్యులరిజం’’గా అభివర్ణించారు. కాశీ అనే హిందూ పవిత్ర నగరం పేరుపై ఉన్న కేఫ్‌లో బీఫ్ వడ్డించడం ఆ రెస్టారెంట్ హక్కే అని.. ఇదే తరహాలో ఒక ముస్లిం పవిత్ర నగరం పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేసి, అందులో పంది మాంసం వడ్డిస్తే ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన భావాలను గౌరవించే విషయంలో ఇలా వ్యవహరించవద్దని వ్యాఖ్యానించారు.
Also Read
- Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
- Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
- Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
- PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
కాంగ్రెస్, సీపీఎం పార్టీలు ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, జమాతే ఇస్లామీతో వ్యవహరిస్తున్న తీరును కూడా చంద్రశేఖర్ తప్పుపట్టారు. ఈ పార్టీల రాజకీయ వైఖరి కేరళ ప్రజలకు పరిమితమైన ఎంపికలనే మిగులుస్తోందని ఆరోపించారు. జమాతే ఇస్లామీ లౌకికవాదానికి, రాజ్యాంగానికి వ్యతిరేక సంస్థ అని అన్నారు.
దీనికి ముందు ఈ వివాదంపై స్పందించిన సీఎం వీడి సతీషన్ .. కేరళ ప్రజలు ఐక్యంగా ఉన్నారని, మత విద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలను సహించబోమని అన్నారు. కేరళను ప్రతికూలంగా చూపిస్తూ, ఫోర్ట్ కొచ్చి గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, వర్గాల మధ్య చీలికలు సృష్టించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదైందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
తాజావార్తలు
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
-
Jr NTR: త్రివిక్రమ్, తమన్లకు తారక్ క్లాస్.. అప్పట్లో జరిగిందిదేనట!
-
AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?